Begin typing your search above and press return to search.

లైంగిక సమస్యలకు డార్క్ చాక్లెట్ ట్రీట్ మెంట్!

By:  Tupaki Desk   |   7 July 2023 2:56 PM GMT
లైంగిక సమస్యలకు డార్క్ చాక్లెట్ ట్రీట్ మెంట్!
X
వయసు పెరుగుతున్న కొద్దీ సెక్స్ సామర్థ్యం, లైంగిక కోరికలు తగ్గడం సర్వ సాధారణమైన విషయంగానే చెబుతారు. ఇదే సమయంలో మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల కొంతమంది వయసులో ఉన్నవారికి సైతం ఈ సమస్యలు ఉన్నాయని అంటుంటారు. అలాంటి వారికి డార్క్ చాక్లెట్ అద్భుత ఔషదం అని అంటున్నారు నిపుణులు!

అవును... డార్క్ చాక్లేట్ రుచి కొద్దిగా చేదుగా ఉన్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లైంగిక కోరికలు పెరిగేలా చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు! ఆ రకమైన సమస్యలతో బాధ పడేవారు డార్క్ చాక్లేట్ ను రోజూ తీసుకుంటే రెచ్చిపోతారని అంటున్నారు.

ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లను క్రమం తప్పకుండా తినడం వల్ల పురుషులు, మహిళల్లో లైంగిక పనితీరు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

డార్క్ చాక్లెట్ ఒక సహజ కామోద్దీపనగా పనిచేస్తుందని.. ఫలితంగా ఇది ఆనందం, శ్రేయస్సుతో ముడిపడి ఉన్న సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుందని అంటున్నారు.

ఫలితంగా భాగస్వాములిద్దరికీ మరింత సానుకూల, ఆహ్లాదకరమైన లైంగిక అనుభూతిని కలిగిస్తుందని చెబుతున్నారు. అయితే... కేవలం "ఆ" ప్రయోజనాలే కాకుండా... ఈ చాక్లెట్ల వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. డార్క్ చాక్లెట్ వల్ల గుండె జబ్బుల ప్రమాదాలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

ఇవి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతోపాటు.. బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇవి రక్తపోటును కంట్రోల్ చేస్తాయని, కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయని అంటున్నారు.