Begin typing your search above and press return to search.
వైరస్ ఎఫెక్ట్ : ముచ్చటగా మూడోసారి వాయిదా పడ్డ ప్రధాని పెళ్లి !
By: Tupaki Desk | 26 Jun 2020 10:10 AM GMTపెళ్లి ..ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే ఒకసారి జరిగే అద్భుతమైన పండుగ. అలాంటి ఓ గొప్ప కార్యం మూడోసారి కూడా వాయిదా వేసుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. అయితే , మూడు సార్లు పెళ్లి వాయిదా వేసుకున్నది సదా సీదా వ్యక్తి కాదు ...డెన్మార్క్ ప్రధాని మిట్టే ఫ్రెడ్రిక్‌సన్. ఈయన తన దేశం కోసం ముచ్చటగా మూడోసారి పెళ్లి వాయిదా వేసుకోవడం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు ఎంతో మంది పెళ్లిళ్లను వాయిదా వేసుకోవడం కథలుకథలుగా విన్నాం. కానీ, డెన్మార్క్ ప్రధాని మూడోసారి పెళ్లి వాయిదా వేసుకోడానికి మాత్రం ఈ మహమ్మారి కారణం కాదు. ఎంతో కీలకమైన ఐరోపా సమాఖ్య సదస్సుకు హాజరయ్యేందుకు వివాహాన్ని వేసుకోవాల్సి వచ్చింది. గతంలో వైరస్ యథేచ్ఛగా వ్యాప్తి చెందుతుండడం, లాక్ డౌన్ విధించిన కారణంగా రెండుసార్లు తన పెళ్లిని డెన్మార్క్ ప్రధాని వాయిదా వేసుకున్నారు.
ఈ సందర్భంగా డెన్మార్క్ ప్రధాని సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సందేశాన్ని వెల్లడించారు. ఈ అద్భుతమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఎంతో ఉద్వేగంగా, ఉత్సాహంగా వేచి చూస్తున్నా అంటూ తన కాబోయే భర్త ‘బో’తో కలిసున్న ఫొటోను ఆమె ఫేస్ బుక్ లో షేర్ చేశారు. త్వరలో తామిద్దరూ పెళ్లి అనే బంధంతో ఒక్కటి కానున్నామని తెలిపారు. తానే కాదు, తనకు కాబోయే జీవిత భాగస్వామి కూడా అద్భుతమైన ఆ రోజు కోసం ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నారన్నారు. తమ పెళ్లికంటే దేశ ప్రయోజనాల దృష్ట్యా శనివారం బ్రసెల్స్‌లో జరిగే ఐరోపా సమాఖ్య సదస్సు ముఖ్యమైనదిగా భావించి మూడోసారి పెళ్లి వాయిదా వేసుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. కానీ పెళ్లి వాయిదా వేసుకోవడం, దాని కోసం ఎదురు చూడడం మాటల్లో చెప్పేంత సులభం కాదని ఆమె తెలిపారు.