Begin typing your search above and press return to search.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ లో బంధుప్రీతి .. బీసీసీఐ ని చూసైనా నేర్చుకోండి..!
By: Tupaki Desk | 8 Dec 2020 4:34 AM GMTపాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానీష్ కనేరియా ఫైర్ అయ్యారు. పీసీబీలో బంధుప్రీతి ఎక్కువైందని.. బాగా ఆడుతున్న ఆటగాళ్లను పక్కనపెట్టి .. చెత్త ప్రదర్శన ఇస్తున్నవాళ్లను ఎంపిక చేస్తున్నారని మండిపడ్డారు. జట్టులో చోటుదక్కకపోవడంతో విసుగుచెందిన పాకిస్థాన్ యువ క్రికెటర్ సామి అస్లామ్ ఆ దేశాన్ని విడిచిపెట్టి అమెరికాకు వెళ్లపోయాడు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ డానీష్ పీసీబీపై విమర్శలు గుప్పించారు. ఏ పరిస్థితుల్లో నైనా క్రికెటర్లను ఎంపికచేయనప్పుడు వాళ్లను కాపాడుకోవాలని సూచించారు. ‘ఐపీఎల్లో రాణించిన సూర్యకుమార్‌ను బీసీసీఐ ఎంపికచేయలేదు. కానీ అతడు దేశం విడిచి వెళ్లలేదు. అందుకు కారణం ఎప్పటికైనా బీసీసీఐ తనకు అవకాశం ఇస్తుందని అతడిని నమ్మకం ఉండటమే. బీసీసీఐ అతడికి భరోసా ఇచ్చింది. కానీ పాకిస్థాన్‌లో ఆ పరిస్థితి లేదు అందుకే సామి అస్లామ్ దేశం విడిచివెళ్లాడు’ అని డానీష్ కనేరియా అన్నారు.
పాకిస్థాన్ యువ క్రికెటర్ సామి అస్లామ్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శనే ఇస్తున్నాడు. కానీ పీసీబీ అతడిని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. న్యూజిలాండ్ టూర్‌కు కూడా పక్కనపెట్టింది. బలోచిస్తాన్ సెకండ్ ఎలెవన్‌కు కూడా డీమోట్ చేసింది. దీంతో తీవ్ర నిరాశ చెందిన అస్లామ్ నేషనల్ టీ20 నుంచి తప్పుకున్నాడు. అమెరికా నుంచి బరిలోకి దిగేందుకు అక్కడికి వెళ్లిపోయాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బాగా రాణించాడు.
కానీ సెలెక్టర్లు ఆస్ట్రేలియా టూర్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది. సూర్యకుమార్ కు అంతర్జాతీయ క్రికెటర్లు సైతం అండగా నిలబడ్డారు. సూర్య ఇంటర్నేషనల్ క్రికెట్ లో రాణించాలంటే న్యూజిలాండ్ రావాలని ఆ దేశ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ ట్వీట్ చేశారు. డానిశ్ ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ప్రస్తావిచారు. సూర్యకుమార్ కు బీసీసీఐ అండగా నిలబడిందని.. అదే సమయంలో అస్లామ్ ను పీసీబీ పక్కనపెట్టిందని ఆయన ఆరోపించారు.