Begin typing your search above and press return to search.

ఆ టెన్నిస్ స్టార్ కు రూ.4.3లక్షల ఫైన్

By:  Tupaki Desk   |   5 Oct 2020 5:30 AM GMT
ఆ టెన్నిస్ స్టార్ కు రూ.4.3లక్షల ఫైన్
X
ఆట తక్కువ ఆవేశం ఎక్కువన్నట్లుగా ఉంటుంది రష్యా టెన్నిస్ స్టార్ ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ వ్యవహారమంతా. టైటిళ్లను సొంతం చేసుకోవటం కంటే.. తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అతగాడి తీరుతో ఆంపైర్లు తరచూ ఫైన్లు వేస్తున్నారు. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో ఆట వేళ.. టెన్నిస్ ప్లేయర్లు అవసరానికి మించిన ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. లైన్ అంపైర్ల తీరు మీద ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించటం ఈ మధ్యన పెరిగింది.

దీంతో.. గతంతో పోలిస్తే మరింత కటువుగా వ్యవహరిస్తున్నారు టెన్నిస్ టోర్నమెంట్ నిర్వాహకులు. తాజాగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్ లో పలు సందర్బాల్లో నిబంధనల్ని ఉల్లంఘించిన ఆటగాళ్లకు పెద్ద ఎత్తున జరిమానాను విధించటం గమనార్హం. ఈ టోర్నీలో ఇప్పటివరకు 20 మంది ఆటగాళ్లకు ఫైన్లు వేశారు. అందరి కంటే ఎక్కువ ఫైన్ వేయించుకున్న ఆటగాడిగా మెద్వెదేవ్ నిలిచారు.

మిగిలిన వారితో పోలిస్తే..ఇతగాడి మీద భారీ జరిమానాను విధించటానికి కారణం.. టెన్నిస్ రాకెట్ ను బలంగా నేలకేసి కొట్టటమే. పుక్సోవిక్ తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో ఓ ఫోర్ హ్యాండ్ షాట్ ను సరిగా కొట్టలేకపోయాడు. దీంతో.. ఆవేశానికి గురైన అతగాడు.. రాకెట్ ను నేలకేసి బలంగా కొట్టాడు. ఇతగాడి తీరుతో రూ.4.3లక్షల భారీ మొత్తాన్ని జరిమానా విధించారు. తాజా ఫైన్ తో అతగాడు ఒక రికార్డును క్రియేట్ చేశారు.

ఒకే నెలలో రెండు ఫైన్లు చెల్లించాల్సి వచ్చిన ఆటగాడిగా నిలిచాడు. ఇటీవల యూఎస్ ఓపెన్ లో ఛైర్ అంపైర్ ఫై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినందుకు ఇతడిపై రూ.2.40లక్షల మొత్తాన్ని ఫైన్ గా విధించారు. ఈసారి రాకెట్ బలంగా నేలకేసి కొట్టినందుకు మరింత భారీగా జరిమానాను విధించారు. అర్జెంట్ గా ఆవేశాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చేసినట్లుగా కనిపించట్లేదు?