Begin typing your search above and press return to search.

కరోనా తో అల్లాడిపోతోన్న యూపీ ...వెలుగులోతెచ్చిన ఫారెన్ మీడియా

By:  Tupaki Desk   |   10 May 2021 5:30 AM GMT
కరోనా తో అల్లాడిపోతోన్న యూపీ ...వెలుగులోతెచ్చిన ఫారెన్ మీడియా
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. రోజుకి నాలుగు లక్షల మందికి పైగా కరోనా మహమ్మారి భారిన పడుతున్నారు. అలాగే మూడువేలమందికి పైగా మృత్యువాత పడుతున్నారు. దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అనేక చోట్ల ఉన్న దారుణ పరిస్థితులపై అంతర్జాతీయ మీడియా కూడా ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఓ ఫారెన్ మీడియా సంస్థ యూపీలోని ఆసుపత్రుల్లో ఉన్న దుస్థితిపై కొన్ని నిజాలని బయటపెట్టింది. ఆసుపత్రికి వచ్చిన కరోనా బాధితుల్ని పట్టించుకునే నాథుడే లేడని, బాధితులంతా తమకు ఎప్పుడు బెడ్ ఇస్తారా , ఎప్పుడు చికిత్స చేస్తారా అని ఆసుపత్రి ఆవరణలోనే వేచి చూస్తున్నారంటూ తెలిపింది.

ఇదే సమయంలో కొందరు కరోనా బాధితులతో మాట్లాడి వారి కన్నీటి గాధను తెలిపే ప్రయత్నం చేసింది. ఊపిరందని స్థితిలో ఉన్న కొడుకును చూస్తూ ఆక్రోశిస్తున్న ఓ తండ్రి ఆక్రందనను, అమ్మ ప్రాణం కోసం అల్లాడిపోతున్న నలుగురు కొడుకుల ఆవేదనను, ఆక్సిజన్ కోసం ప్రాథేయపడుతూ 4 రోజులుగా నేలపైనే పడిగాపులు కాస్తున్న ఓ మహిళ బాధను కళ్లకి కట్టినట్టు చూపించింది. అలాగే ప్రతిరోజూ ఎంతో మంది మృత్యువుతో పోరాడి అలసిపోయి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలనూ వెలుగులోకి తీసుకువచ్చింది. అప్పుడే అక్కడే ఉన్న ఓ అమ్మ కరోనా కాటుకి బలైపోయింది. ఆమె పిల్లలు ఆమెని బ్రతికించుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా కూడా అసలు లాభం లేకుండా పోయింది. డాక్టర్ వచ్చి ఆమె మృతి చెందింది అని చెప్పారు. దీనితో ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం కాదా , ముప్పును ఊహించకుండా, దానిని ఎదుర్కొనేందుకు కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా ఉండడం వల్లనే ఇప్పుడు ఇలాంటి దుస్థితి ఏర్పడుతోందని ఆ ఫారెన్ మీడియా సంస్థ ఆరోపించింది. ఆసుపత్రుల్లో ఉన్న ఎక్కువమంది బాధితులు తమకు ఆక్సిజన్ అందడం లేదని ఆరోపించగా.. దీనిపై సదరు మీడియా ప్రతినిధి ఈ సమస్యపై ఆసుపత్రి ఇంచార్జిని అడిగితే , ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏమీ లేదని, స్టాఫ్ తక్కువగా ఉండడం వల్లనే సమస్యలు తలుత్తుతున్నాయని ఆ ఇంచార్జి చెప్పుకొచ్చారు.