Begin typing your search above and press return to search.

స్టేట్‌ హోంలో 57 మందికి పాజిటివ్..ఐదుగురు ప్రెగ్నెంట్ !

By:  Tupaki Desk   |   22 Jun 2020 11:00 AM IST
స్టేట్‌ హోంలో 57 మందికి పాజిటివ్..ఐదుగురు ప్రెగ్నెంట్ !
X
ఓ వైపు మహమ్మారి విలయతాండవం చేస్తుంటే… వైరస్ ను చాలా ఈజీగా తీసుకుంటున్నారు అధికారులు. కొందరు క్వారంటైన్ జోనుల్లో క్రికెట్ ఆడుతూ డ్యాన్సులు చేస్తున్నారు. అలాగే , క్వారంటైన్ సెంటర్ లో ఉన్న మహిళలపై లైంగిక దాడులు జరగడం కూడా గమనించాము. ఇప్పుడు స్టేట్ హోమ్ లో ఉన్న 57 మంది బాలికలకు వైరస్ పాజిటివ్ రావడంతో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వారిలో ఐదుగురు గర్భవతులు ఉండటం అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. యూపీ ప్రభుత్వ షెల్టర్‌ హోంలో ఉంటున్న బాలికలకు ఇటీవల కోవిడ్‌ నిర్ధారణ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో 57 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిన విషయం బయటపడింది. వీరిలో ఐదుగురు గర్భవతులుగా ఉండటం గమనార్హం. అంతేకాకుండా ఒకరికి హెచ్ ‌ఐ‌వి పాజిటివ్ గా తేలింది మరొకరికి హేపీటైటిస్ సి ఉన్నటుగా నిర్ధారణ జరిగింది. అయితే ఆ ఐదుగురు మహిళలకు స్టేట్ హోమ్ లోకి వచ్చిన తరువాత గర్భం వచ్చిందా లేక మునుపే గర్భం ఉందా అనేది పెద్ద ప్రశ్న.

కానీ, అధికారులు మాత్రం ఆ మహిళలు అంతా భాదితులేనని అత్యాచారాలకు గురైన వారు లైంగిక దాడులకు గురైన వారికే అక్కడ బసకు ఏర్పాటు చేశాము అని తేల్చి చెబుతున్నారు. స్టేట్ హోం పరిస్థితి మరీ దారుణంగా ఉందని శుభ్రతకి తావు లేదని అక్కడకు వెళ్ళిన మహిళా సంఘాలు చెబుతున్నాయి, వారికి కరోనా ఎలా సోకిందని ఖచ్చితమైన సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని వారు మండిపడుతున్నారు.

ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేయడం జరుగుతోందని, రెండు నెలల్లో ఎవరు వచ్చారు ? ఎక్కడకు వెళ్లారు ? వీరికి కరోనా వైరస్ ఎలా సోకిందనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. నివాసంలోకి మగవారిని అనుమతించమని, కానీ అప్పటికే బాలికలు గర్భవతులయ్యారని యూపీ ఉమెన్స్ కమిషన్ మెంబర్ పూనమ్ కపూర్ తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఐతే , ఈ ఘటన పై మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.