Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ విషయంలో బలవంతం చేయరట

By:  Tupaki Desk   |   11 Nov 2020 2:45 AM GMT
వ్యాక్సిన్ విషయంలో బలవంతం చేయరట
X
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఒకసారి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత... దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ వేయించేందుకు వీలుగా పలు దేశ ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వ్యాక్సిన్ కనుగొనకపోయినా.. ముందే ఆర్డర్లు ఇచ్చేసి.. వందల కోట్ల రూపాయిల్ని అడ్వాన్స్ గా ఇచ్చిన దేశాలు ఉన్నాయి.

ఇలాంటివేళ బ్రిటన్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారటమే కాదు.. ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది. ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంటే.. బ్రిటన్ మంత్రి మాత్రం వ్యాక్సిన్ వేసుకోవాలా? వద్దా? అన్న విషయాన్ని ప్రజలకు విడిచిపెడతామని చెప్పటం గమనార్హం. తమ దేశంలోని పిల్లలు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదని శెలవిచ్చారు బ్రిటన్ ఆరోగ్యశాఖామంత్రి మాట్ హాన్ కాక్.

కరోనా సెక్ండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి ఆ దేశంలో లాక్ డౌన్ విధించారు. ఇలాంటివేళలోనూ.. వ్యాక్సిన్ వచ్చాక వేయించుకోవాలా? వద్దా? అన్నది పూర్తిగాప్రజలకే వదిలేయటమా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆ దేశంలో 12 లక్షలు కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ తీవ్రత చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో.. టీకా ఎప్పుడు వస్తుందా? అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే.. అందుకు భిన్నంగా బ్రిటన్ మంత్రిగారుఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని తాము ప్రతిపాదించటం లేదని.. అయినప్పటికీ ఎక్కువమంది ప్రజలు టీకాలు వేయించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. చిన్నారులకు టీకాల అవసరం లేదని.. ఎందుకంటే పిల్లలు కరోనా బారిన పడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు చెప్పారు. చూస్తుంటే.. వ్యాక్సిన్ వచ్చినంతనే ప్రజలు పెద్ద ఎత్తున తమకు ముందు వేయాలని కోరే అవకాశం ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. బ్రిటన్ మంత్రిగారి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.