Begin typing your search above and press return to search.
రష్యాలో షురూ.. బ్రిటన్ లో రేపటి నుంచే మొదలు పెడుతున్నారు
By: Tupaki Desk | 7 Dec 2020 4:30 AM GMTఇంతకాలం సమాధానం లేని ప్రశ్నల్ని మిగిల్చిన కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ సిద్ధమైంది. మొన్నటివరకు పరిశోధనల్లో ఉన్నప్పటికీ రష్యా తన వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను జోరుగా చేపడుతున్న వేళ.. ఆ బాటలో మరిన్ని దేశాలు అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి బ్రిటన్ కూడా చేరింది. మంగళవారం నుంచి కరోనా వ్యాక్సిన్ వేయటానికి వీటుగా ఆ దేశం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందుకోసం 50 జాతీయ ఆరోగ్య సేవా ఆసుపత్రుల్లో మహమ్మారిని తరిమికొట్టటానికి వీలుగా ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వటానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.
వ్యాక్సినేషన్ లో భాగంగా తొలుత 80 ఏళ్ల వయసు పైబడిన వారికి.. వారికి సంరక్షకులుగా ఉండే వారికి వ్యాక్సిన్ ఇస్తారు. ప్రజలంతా వ్యాక్సినేషన్ కు సహకరించాలని.. నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలని బ్రిటన్ ఆరోగ్య శాఖా మంత్రి మట్ హన్ కాక్ పిలుపునిచ్చారు. సెకండ్ వేవ్ కారణంగా అతలాకుతలమవుతున్న యూకే.. తాజా వ్యాక్సిన్ తో కరోనా జోరుకు కళ్లాలు వేస్తుందని భావిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా 6.7 కోట్ల జనాభా ఉన్న ఆ దేశంలో తొలివిడదలో రెండు కోట్ల మందికి టీకా ఇవ్వనున్నారు. ఇందుకోసం ఫైజర్ కు నాలుగు కోట్ల డోసులకు ఆర్డర్ చేసింది. బ్రిటన్ తో పాటు.. బెల్జియంకు ఇప్పటికే 8 లక్షల డోసులు చేరుకున్నాయి. వ్యాక్సినేషన్ లో భాగంగా బ్రిటన్ రాణి 94 ఏళ్ల ఎలిజెబెత్ కు.. ఆమె భర్త 99 ఏళ్ల ప్రిన్స్ ఫిలిప్ కు త్వరలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
వయసును పరిగణలోకి తీసుకొని వారికి తొలి ప్రాధాన్యంగా టీకా ఇవ్వనున్నారు. అంతేకాదు.. వ్యాక్సిన్ కారణంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్న నమ్మకాన్ని పెంచుందుకు వీలుగా రాణితో పాటు.. ఇతర ప్రముఖులు కూడా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. అయితే.. వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకుంటున్నారన్న విషయాన్ని బకింగ్ హోమ్ ప్యాలెస్ ఇంకా అధికారిక ప్రకటన వెలువరించలేదు.