Begin typing your search above and press return to search.
సారూ.. సిద్దిపేట స్టోరీ విన్నారా? వెంటనే రియాక్టు అవ్వాలె
By: Tupaki Desk | 26 Feb 2021 5:10 AM GMTచిన్నపాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే. కరోనా విషయంలోఇప్పటికే నిరూపితమైన ఈ అంశాన్ని పాలకులు.. కీలక అధికారులు ఎప్పటికప్పుడు విస్మరించటంతో కొత్త ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు కరోనా కలకలం కొంతమేర తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. తెలంగాణలో చాప కింద నీరులా పెరుగుతున్న పాజిటివ్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం అలెర్టు కావాల్సిన టైం వచ్చేసినట్లుగా కనిపిస్తోంది.
మొన్నా మధ్య కరీంనగర్.. ఈ మధ్యనే వరంగల్.. తాజాగా సిద్ధిపేటలో కరోనా కేసుల కలకలం ఇప్పుడు కలవరపాటుకు గురి చేస్తోంది. జిల్లాలోనికొండపాక ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేగింది. రెండురోజుల క్రితం పాఠశాలకు చెందిన టీచర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. తాజాగా స్కూల్ విద్యార్థుల్లోనూ కరోనా లక్షణాలు కనిపించటంతో ఉలిక్కిపడుతున్నారు.
తాజాగా పరీక్షలు జరపగా.. స్కూల్లోని 22 మంది విద్యార్థులతో పాటు.. నలుగురు టీచర్లలో కరోనా లక్షణాలు కనిపించటం గమనార్హం. దీంతో.. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులందరికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల ఫలితాలు శనివారం రానున్నాయి.
ఒకవేళ.. కేసుల సంఖ్య మరింత పెరిగితే.. ప్రభుత్వం మరింత త్వరగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేరళ.. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇలాంటివేళ.. ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నది మర్చిపోకూడదు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసులు అక్కడక్కడ కనిపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఈ ఇష్యూపై ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు.