Begin typing your search above and press return to search.
కరోనాపై టీ సర్కార్ సంచలన నిర్ణయం..అందరికి యాంటీబాడీస్ టెస్టులు!
By: Tupaki Desk | 19 Aug 2020 11:10 AM GMTతెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకి నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెనుగుతూనే ఉంది. అదే సమయంలో తెలంగాణలో కరోనా పరీక్షలు ఎక్కువగా చేయడం లేదనే వాదన కూడా ఎక్కువగా వినిపిస్తుంది. అయితే , ప్రభుత్వం మాత్రం , WHO నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు చేస్తున్నాం అని చెప్తుంది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచకపోవడం వల్లే రోజు కొన్ని కొన్ని కేసులే బయటపడుతున్నాయని , పరీక్షల సంఖ్య భారీగా పెంచితే మంచిది అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేసే కరోనా టెస్టుల విషయం లో హైకోర్టు కూడా రెండుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షల సంఖ్యను పెంచుకుంటూపోతుంది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సోకి కోలుకున్న వ్యక్తులను గుర్తించి వారికి యాంటీబాడీస్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాంటీబాడీస్ పరీక్ష ద్వారా ఎంత మేర వైరస్ వ్యాప్తి చెందింది తెలుసుకునే వీలుంది. అలాగే యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్టు గుర్తిస్తే ప్లాస్మా దానికి కూడా అర్హులు అవుతారు. అలాగే సామాజిక వ్యక్తిని గుర్తించి కరోనా ను కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ముందుగా జిహెచ్ ఎం సి పరిధిలో ఈ పరీక్షలు చేయనుంది. ఆ తరువాత రాష్ట్రం మొత్తం ఈ యాంటీబాడీస్ పరీక్షలు చేయాలనీ నిర్ణయిచింది.
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,763 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1789 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,700కు చేరింది. ఆసుపత్రుల్లో 20,990 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 73,991 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 719కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 484 మందికి కొత్తగా కరోనా సోకింది. తెలంగాణలో మొత్తం 7,97,470 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.