Begin typing your search above and press return to search.

తెలంగాణలో తీవ్రస్థాయిలో వైరస్ విజృంభణ: కొత్తగా 1,879 కేసులు

By:  Tupaki Desk   |   8 July 2020 5:00 AM GMT
తెలంగాణలో తీవ్రస్థాయిలో వైరస్ విజృంభణ: కొత్తగా 1,879 కేసులు
X
మహమ్మారి వైరస్ తెలంగాణలో తీవ్ర స్థాయిలోనే విజృంభిస్తోంది. రోజు 1,500కు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మంగళవారం 1,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 మంది వైరస్ తో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 27,612కి చేరగా.. మొత్తం మృతులు 313 మంది ఉన్నారు.

వైరస్ నుంచి కోలుకుని 1,506 మంది డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 11,012 అత్యధికంగా కొత్తగా కేసులు యథావిధిగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి.. మేడ్చల్.. సంగారెడ్డి.. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అధిక కేసులు నమోదవుతున్నాయి. అయితే వైరస్ కట్టడి చర్యలపై మాత్రం ఉన్నత స్థాయి సమీక్ష ధారం రోజులుగా లేదు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొన్ని రోజులుగా ప్రగతిభవన్ లో ఉండడం లేదని సమాచారం. ఆయన కుమారుడు కేటీఆర్ కూడా కనిపించడం లేదు.