Begin typing your search above and press return to search.

పాక్ జట్టుని పట్టిపీడిస్తున్న కరోనా ..మరో ఆల్‌ రౌండర్‌ కి పాజిటివ్!

By:  Tupaki Desk   |   17 July 2020 5:45 AM GMT
పాక్ జట్టుని పట్టిపీడిస్తున్న కరోనా ..మరో ఆల్‌ రౌండర్‌ కి పాజిటివ్!
X
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంబిస్తు ఎవరిని వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుండి మొదలుకొని అధికారులు - ప్రముఖులు - ప్రజాప్రతినిధులు ఆటగాళ్లు ..ఇలా ప్రతి ఒక్కరూ కూడా కరోనా భారిన పడుతున్నారు. ఇకపోతే , పాకిస్థాన్ క్రికెట్ జట్టుని కరోనా వైరస్ వేటాడుతూనే ఉంది. ఇంగ్లాండ్ టూర్‌ కోసం గత నెలలో 29 మందితో కూడిన జట్టుని ప్రకటించిన పీసీబీ.. క్యాంప్‌ కి ముందు కరోనా వైరస్ పరీక్షలు చేయగా అందులో ఏకంగా 10 మందికి కరోనా పాజిటివ్‌ గా తేలింది. అయితే ఈ 10 మందిలో మహ్మద్ హఫీజ్ పర్సనల్ ‌గా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోగా నెగటివ్ గా తేలింది.

దీనితో మొత్తంగా 20 మంది క్రికెటర్లని ఇంగ్లాండ్ టూర్‌ కి మొదట పీసీబీ పంపింది. కరోనా పాజిటివ్‌ గా ఉన్న 9 మంది క్రికెటర్ల లో.. హైదర్ అలీ - ఇమ్రాన్ ఖాన్ - కాశీఫ్ భట్టి‌లకి ఇటీవల నెగటివ్ రావడంతో వారిని కూడా ఇంగ్లాండ్ ‌కి పంపింది. అయితే , ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈ ముగ్గురికీ పరీక్షలు చేయగా ఆల్‌ రౌండర్ కాశీఫ్ భట్టీకి కరోనా పాజిటివ్ ‌గా తేలింది. దీనితో భట్టీని సెల్ఫ్ ఐసోలేషన్‌ లో ఉండాలని ఈసీబీ ఆదేశించింది. దీనితో పాక్ యాజమాన్యం ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితి లో ఉంది.

ఆగస్టు 5 నుంచి ఇంగ్లాండ్ - పాకిస్థాన్ మధ్య మూడు టెస్టులు - మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుండగా ఈ సిరీస్ మొత్తాన్ని పూర్తి బయో-సెక్యూర్ వాతావరణంలో ఈసీబీ నిర్వహించబోతోంది. ఈ కారణంగానే నెల రోజుల ముందే అక్కడికి పాక్ టీమ్ ‌ని రప్పించిన ఈసీబీ.. 14 రోజులు క్వారంటైన్‌ లో ఉంచింది. అలాగే వారికీ కరోనా టెస్టులు చేసి నెగటివ్ వచ్చిన తరువాతే గ్రౌండ్ లోకి అనుమతి ఉంటుంది అని తెలిపింది.