Begin typing your search above and press return to search.
ధారవిలో కరోనా: నమ్మశక్యం కాని పాజిటివ్ కేసులు !
By: Tupaki Desk | 4 Jun 2021 4:09 AM GMTగతంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి కేంద్రబిందువుగా మారిన ధారవి.. ఇప్పుడా మహమ్మారిని జయించటంలో ముందడుగు వేసి ఆదర్శంగా నిలుస్తోంది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ మురికివాడలో అధికారిక గణాంకాల ప్రకారం తాజాగా నమోదైన కరోనా వైరస్ కేసుల సంఖ్య కేవలం ఒక్కటి మాత్రమే కావటం గమనార్హం. గత 24 గంటల్లో కేవలం ఒకే ఒక్క పాజిటివ్ కేసు ఇక్కడ నమోదు కావడం విశేషం. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19 మాత్రమే. అంతేకాకుండా కరోనా సోకిన వారిలోదాదాపుగా అందరూ కోలుకున్నట్టు తెలియచేస్తున్న గణాంకాలు ఆశావహంగా ఉన్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ధారవి, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మురికివాడగా ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతంలో తొలి కరోనా కేసు గత ఏడాది ఏప్రిల్ లో నమోదయింది. దీంతో అధికారులు, ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. కేవలం 2.16 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి, పది లక్షలు దాటిన జనాభాతో సామాజిక దూరాన్ని పాటించటం ఇంచుమించు అసాధ్యం అనే పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో.. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న కేసుల సంఖ్య తొలుత ఆందోళన కలిగించినా.. మడమ తిప్పని బృహన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు కరోనా కట్టడికి ప్రత్యేక వ్యూహాన్ని రచించారు. దీనిలో భాగంగా 47 వేల గృహాల్లో సుమారు సుమారు ఏడు లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముందస్తు పరీక్షల నిర్వహణతో అనేక కేసులను పరిస్థితి తీవ్రం కాకముందే గుర్తించారు. ట్రేసింగ్ , టెస్టింగ్ , ట్రీట్మెంట్ ద్వారా ధారవి లో కరోనా ను అంతం చేశారు అధికారులు.