Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో మళ్లీ కరోనా.. కఠిన ఆంక్షలు..!

By:  Tupaki Desk   |   17 March 2021 3:30 AM GMT
మహారాష్ట్రలో మళ్లీ కరోనా.. కఠిన ఆంక్షలు..!
X
దేశంలో కరోనా మళ్లీ మంచుకొస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుగుతండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం హై అలర్ట్​ ప్రకటించింది. కఠిన నిబంధనలు అమలు చేయబోతున్నది. ఒక్క సోమవారం 15,051 కొత్త కేసులు నమోదయ్యాయి. 10,671 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,30,547 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.

ప్రైవేట్​ కార్యాలయాలు వర్క్​ ఫ్రం హోం కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలను కూడా 50 శాతం హాజరుతో నడపనున్నారు. మార్చి 31 వరకు ఈ రూల్స్​ కొనసాగనున్నాయి. సినిమాహాళ్లు, రెస్టారెంట్లు కూడా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుపుకోవాలి. రూల్స్​ బ్రేక్​ చేస్తే సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు ప్రజలందరికీ స్క్రీనింగ్​ టెస్ట్​ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా సినిమా హాళ్లకు, షాపింగ్​ హాళ్లకు వచ్చేవాళ్లకు తప్పనిసరిగా స్క్రీనింగ్ టెస్ట్​ చేయబోతున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన సినిమా హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లను కేంద్ర ప్రభుత్వం కోవిడ్ 19 విపత్తు కింద మూసివేస్తామన్నారు. అంతేగాక, జరిమానాలు కూడా విధిస్తామని తెలిపింది.

ఇక షాపింగ్ మాల్స్ కూడా మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగం తప్పనిసరి అని పేర్కొంది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఒక రాష్ట్రంలో నిర్వహించే ప్రైవేట్ కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలపై నిబంధనలు విధించారు. కేవలం 50 శాతం మందితోనే ఆయా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. వివాహ వేడుకలు, ఇతర వేడుకలను కూడా కేవలం పరిమితమైన సంఖ్యలో జనాలతో మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొన్నది.