Begin typing your search above and press return to search.
కరోనా కలకలం ఒకే పాఠశాలలో 229 మంది విద్యార్థులకు పాజిటివ్ ..!
By: Tupaki Desk | 25 Feb 2021 9:40 AM GMTకరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దేశంలో అత్యధిక కేసులు వెలుగులోకి వచ్చిన మహారాష్ట్ర లో కరోనా మళ్లీ పంజా విసురుతుంది. అక్కడ కేసులు పెరుగుతండటంతో నైట్ కర్ఫ్యూ విధించారు. కొన్ని జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు మూసేశారు. తాజాగా వాషిమ్ జిల్లాలోని రిసోడ్ తాలూకాలోని డేగాన్ కు చెందిన ఒక పాఠశాల హాస్టల్ లో 327 మంది విద్యార్థులు ఉంటున్నారు. వారిలో 229 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. విద్యార్థులతోపాటు నలుగురు ఉద్యోగులు కూడా కరోనా సోకింది. ఇందులో ఎక్కువమంది 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్నరే. కరోనా భారీన పడ్డా విద్యార్థులలో ఎక్కువ మంది ధరణి, అచల్ పూర్, మెల్ఘాట్ బెల్ట్ లకు చెందినవారే. కరోనా సోకినా విద్యార్థులను వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు.
దీనితో ఆ పాఠశాల ప్రాంగణాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. వీరిలో చాలామంది విద్యార్థులు అమరావతి మరియు యావత్మల్ జిల్లాలకు చెందినవారు ఉన్నారు. ఆ ప్రాంతాల్లో గత కొన్ని రోజులు నుంచి అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 8,000 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో కరోనా ఆంక్షలను పాటించకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం మరియు ముంబై పోలీసులు హెచ్చరించారు.
ఓవైపు దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకుంటుండగా ఇలా విద్యార్థులు కరోనా బారిన పడటం భయాందోళనలకు గురి చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు కంగారుపడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కఠినచర్యలను అమలు చేసే విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో బయటపడిన కొత్త రకం వైరస్ కారణంగా పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందన్న నిజాన్ని గుర్తించాలని సూచించింది.