Begin typing your search above and press return to search.
కేరళను వదలని కరోనా.. ఇప్పటికి వేలాది పాజిటివ్ కేసులు
By: Tupaki Desk | 9 Feb 2021 6:50 AM GMTకరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ అందుబాటులోకి రావటానికి ముందే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల మీద నియంత్రణ కొంతమేర సాధ్యమైంది. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదైన ఏపీలో ఇప్పుడు వందల్లో కూడా రాని పరిస్థితి. రోజుకు దగ్గర దగ్గరగా ఐదు వేల కేసులు నమోదైన హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు వంద.. నూటయాభై కేసుల్లోపే నమోదవుతున్నాయి. అది కూడా తీవ్రత తక్కువగానే. ఇలా చాలా రాష్ట్రాల పరిస్థితి ఉంటే.. కేరళలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది.
అక్కడ ఇప్పటికి రోజూ ఆరువేల కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఆదివారం మాత్రం కేసుల నమోదు తక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణం.. ఆ రోజున పరిమితంగానే పరీక్షలు జరపటం వల్లే. అంతే తప్పించి.. ఆదివారం ఒక్కరోజు కేసులు తక్కువగా రావటం అన్నది లేదు. నిజానికి.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. కేరళలో పెద్ద ఎత్తున జాగ్రత్త చర్యలు తీసుకోవటమే కాదు.. అక్కడ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విరుచుకుపడిన వేళలో కేరళలో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. విచిత్రంగా.. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు తగ్గి.. కరోనా అదుపులోకి వస్తున్న వేళ.. కేరళలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొని ఉంది. తాజాగా కేరళలోని రెండు స్కూళ్లలో 200 మంది విద్యార్థులకు కరోనా కన్ఫం కావటం కొత్త ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. కేరళలో కేసుల నమోదు ఎక్కువగా ఉండటం ఇబ్బందికి గురి చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కేసుల సంఖ్య కొలిక్కి రావట్లేదు.