Begin typing your search above and press return to search.
తెలివంటే వీళ్లదే.. పోయిన చోటే వెతుకున్నారుగా!
By: Tupaki Desk | 7 Sep 2020 6:30 AM GMTకరోనా దెబ్బకు హోటళ్లు, ఆతిథ్యరంగం, చిరువ్యాపారాలు కుదేలయైపోయాయి. ఎం చేయాలో తెలియక కొందరు వ్యాపారాలు వదిలేసి పల్లె బాటపట్టారు. మరికొందరు మాత్రం పోయినచోటే కొత్తదారులు వెతుకుంటున్నారు. అందులో భాగంగానే పెద్దపెద్ద హోటళ్లను, ఫంక్షన్‌హాళ్లను కరోనా క్వారంటైన్ సెంటర్లుగా మార్చారు. కరోనాతో కేరళకు పర్యాటకుల తాకిడి తగ్గిపోయింది. రిసార్టులకు వచ్చేవాళ్లే లేరు. గిరాకీ లేక రిసార్టు యజమానులంతా తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో గిరాకీ లేక కేరళలోని రిసార్టులు, హోటళ్లు దాదాపు 25 వేల కోట్ల నష్టపోయినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
కానీ ఓ రిసార్ట్ యజమాని కాస్త భిన్నంగా ఆలోచించాడు. తన రిసార్ట్‌లోని ఓ స్విమ్మింగ్ ఫూల్‌ను చేపల చెరువుగా మార్చాడు. ఈ చేపలు విక్రయించి ప్రస్తుతం రూ. లక్షలు సంపాదిస్తున్నాడు.
కేరళకు చెందిన అవేదా రిసార్ట్ కూడా కరోనాతో తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నది. నిర్వహణ భారంగా మారడంతోపాటు సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఎలాగైన రిసార్ట్‌లో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వాలని ఆలోచించిన యాజమాన్యం అక్కడి స్విమ్మింగ్ప పూల్‌లో చేపలు పెంచాలని నిర్ణయించింది. ‘లాక్‌డౌన్‌తో మా కంపెనీ నష్టపోయింది. సిబ్బందికి కూడా వేతనాలు ఇవ్వలేక పోతున్నాం. ఈ సమయంలో ఉన్న స్థలాన్ని, వనరులను ఉపయోగించుకొని సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకే చేపల పెంపకం చేపట్టాం’ అని చెప్పారు
అవేదా రిసార్ట్స్ అండ్ స్పా జీఎం జ్యోతీశ్ సురేంద్రన్. 'తమ వద్ద ఉన్న స్విమ్మింగ్ ఫూల్లో రూ. 6 లక్షల పెట్టుబడి పెట్టి 16 వేల కొర్రమీను చేపలను పెంచుతున్నాం. రిసార్ట్‌లో పనిచేస్తున్న సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. చేపలు పెద్దయ్యాక దాదాపు 15 లక్షల ఆదాయం వస్తుందని భావిస్తున్నాం. దీని ద్వారా ఇక్కడ పనిచేసే సిబ్బందికి వేతనాలు చెల్లిస్తాం’ అని చెప్పింది అక్కడి యాజమాన్యం. ఏది ఏమైనా అవేదా యాజమాన్యం తెలివిని పలువురు ప్రశంసిస్తున్నారు.