Begin typing your search above and press return to search.
కరోనా సెకండ్ వేవ్... ఆ నగరంలో రాత్రి కర్ఫ్యూ అమలుకు ప్రభుత్వం నిర్ణయం!
By: Tupaki Desk | 9 April 2021 3:51 AM GMTకరోనా కేసులు దేశవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్నాయి. కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా పెద్దగా ప్రయోజనం లేదు. సెకండ్ వేవ్ లో భాగంగా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ ప్రమాద ఘంటికలు మరికొన్నాళ్ల పాటు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహమ్మారి వేరియంట్లతో పంజా విసురుతోంది. ఫలితంగా అవసరాన్ని బట్టి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి.
రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రతని బట్టి ఆంక్షలు విధించాలని ప్రధాని మోదీ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తూ సీఎం యడ్యూరప్ప ఉత్తర్వులు జారీ చేశారు. బెంగుళూరు సహా ఆరు నగరాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బెంగళూరుతో పాటు మంగళూరు, మైసూరు, బీదర్, కలబురగి, మణిపాల్, తమకూరు నగరాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని మినాహాయింపు కల్పించింది. ఆ రాష్ట్రంలో 24 గంటల్లో 6570 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 36మంది కరోనా కాటుకు బలైనట్లు వైద్య నివేదికలు వెల్లడించాయి.
కర్నాటక రాష్ట్రంలో ఇప్పటివరకు 10,40,130 మంది వైరస్ బారిన పడ్డారు. 12,767మంది ప్రాణాలు కోల్పోయారు. 9,73,949 మంది వైరస్ నుంచి విముక్తి పొందినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కర్నాటకలో 53,395 క్రియాశీల కేసులున్నట్లు తెలిపింది. ఈ మేరకు కరోనా కట్టడిలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యు విధానాన్ని తీసుకొచ్చారు. శనివారం నుంచి అమలులోకి రానుందని తెలిపారు.