Begin typing your search above and press return to search.

'టీకా' వేసుకుంటే మాస్క్ అక్కర్లేదా !

By:  Tupaki Desk   |   30 Jun 2021 7:30 AM GMT
టీకా వేసుకుంటే మాస్క్ అక్కర్లేదా !
X
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ కీలకం అనే విషయాన్ని మొదటి నుండి నిపుణులు చెప్తూనే వస్తున్నారు. కరోనా వ్యాప్తి జరగకుండా సోషల్ డిస్టెన్స్ పాటించడం, పేస్ మాస్క్ ధరించడం, రెగ్యులర్ గా శానిటైజర్ ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. అయితే ముందుగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి జనాలు భయపడ్డారు. కానీ ఇప్పుడు అందరిలో అవగాహన రావడంతో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చా, లేదా తీసుకోవడం వల్ల కలిగే పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ తదితర విషయాలపై ఇప్పటికే అందరికీ కొంత అవగాహన వచ్చేసింది.

ఇదిలా ఉంటే ..కరోనా మహమ్మారి రెండు డోసుల వాక్సిన్ పూర్తయిన తర్వాత పేస్ మాస్క్ తప్పనిసరా లేదా అనే విషయంపై ఇంకా చర్చ నడుస్తుంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ ఓ వారు ఫుల్ గా వాక్సినేషన్ వేయించుకున్న వారు కూడా కచ్చితంగా మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రకటించింది. అయితే ఇంతకు ముందు అగ్రరాజ్యమైన అమెరికాలో యు.ఎస్. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) వారు పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకున్న ప్రజలు ఇక మాస్కు ధరించే అవసరం లేదని వెల్లడించింది. అయితే తాజాగా డబ్ల్యూహెచ్ ఓ మాత్రం మళ్లీ కరోనా విజృంభించకుండా ఉండాలంటే మాస్క్ ధరించాల్సిందే అని, సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాల్సిందేనని హెచ్చరించింది. కరోనా మరోసారి మనల్ని వణికించకుండా మనమే దాన్ని భయపడి పారిపోయేలా చేయాలంటే వ్యాక్సినేషన్ వేయించుకున్నా కూడా అ మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజర్ వాడడం తప్పనిసరి.