Begin typing your search above and press return to search.

దేశంలో క‌రోనా తగ్గుముఖం ... కొత్తగా ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   30 Jun 2021 6:30 AM GMT
దేశంలో క‌రోనా  తగ్గుముఖం ... కొత్తగా ఎన్నంటే ?
X
మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ జోరు క్రమంగా తగ్గుతూవస్తుంది.సెకండ్ వేవ్ లో ఒకానొక సమయంలో నాలుగు లక్షలకి పైగా కరోనా మహమ్మారి కేసులు నమోదు కాగా, తాజా ఆ కేసుల సంఖ్య 50 వేల కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడం, అలాగే కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశంలో విధించిన లాక్ డౌన్ , కఠినమైన ఆంక్షలు. అయితే నిన్నటితో పోల్చి కాస్త తగ్గుముఖం పట్టాయి.

గ‌డ‌చిన 24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 45,951 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. మంగళవారం ఒక్కరోజే 60,729 మంది కోలకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,62,848కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్‌ లో వెల్లడించింది. కాగా, ఆదివారం క‌రోనా నుంచి 2,94,27,330 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇదే స‌మ‌యంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా త‌గ్గింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనాతో చనిపోయిన 817 మందితో కలిపి మొత్తం క‌రోనా మరణాల సంఖ్య 3,98,454 కు చేరింది. దేశంలో ప్రస్తుతం క‌రోనాకు చికిత్స పొందుతున్న వారిసంఖ్య 5,37,064కు చేరింది.