Begin typing your search above and press return to search.

పెళ్లికి వ్యాక్సిన్‌ కు ముడి.. ముందు ముందు ప్రభుత్వాలు కూడా ఇదే పద్దతి!

By:  Tupaki Desk   |   27 Jun 2021 3:30 PM GMT
పెళ్లికి వ్యాక్సిన్‌ కు ముడి.. ముందు ముందు ప్రభుత్వాలు కూడా ఇదే పద్దతి!
X
ప్రస్తుతం విదేశీ ప్రయాణాలు చేయాలంటే వ్యాక్సిన్‌ తీసుకోవడం తప్పనిసరి అయ్యింది. ఏ దేశం వెళ్లాలన్నా కూడా వ్యాక్సిన్ తీసుకుని మా దేశం రండి అంటూ ఆ దేశం ఆహ్వానిస్తుంది. ఈ వ్యాక్సిన్‌ తప్పనిసరి నిబంధంన ముందు ముందు అన్ని చోట్ల రాబోతుంది. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే కొన్ని ఆఫీసుల్లో ఎంట్రీ లభిస్తుంది. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు స్వయంగా వ్యాక్సిన్‌ వేయిస్తున్నారు. కొన్ని సంస్థలు మాత్రం మీరు వ్యాక్సిన్ తీసుకుని ఆ తర్వాతే ఆఫీస్‌ కు రండీ అంటూ నిబంధన పెడుతున్నారు. ఈ నిబంధన ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా అమలు అవుతుంది. ఇటీవల తెలంగాణ స్కూల్స్ రీ ఓపెన్‌ కు ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో స్కూల్స్‌ కు చెందిన అందరు స్టాఫ్‌ కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే అనే నిబంధనను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ విధించింది. ఇలాగే పెళ్లిలకు మరియు వ్యాక్సిన్‌ లకు లింక్ పెడుతున్నారు కొందరు.

వచ్చే నెలలో మా వాడి పెళ్లి ఉంది. ఖచ్చితంగా నువ్వు ఈ నెలలోనే ఏదో ఒక వ్యాక్సిన్‌ తీసుకోవాలి. కనీసం ఒక్క డోసు అయినా తీసుకున్న వారికి మాత్రమే మా వాడి పెళ్లికి ఆహ్వానం ఉంటుందని ఒక పెద్దాయన తన స్నేహితుడితో అంటున్నాడు. అంటే రాబోయే రోజుల్లో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో వారికి మాత్రమే పెళ్లికి అనుమతులు ఉంటాయి. పెళ్లికి హాజరు అవ్వాలంటే ఖచ్చితంగా వ్యాక్సిన్‌ వేసుకుని ఉండాలనే నిబంధన ఇప్పటికే కొందరు అమలు చేస్తున్నారు. తమ పెళ్లి చేసే అయ్యగారు మొదలుకుని వంట చేసే మనిషి.. డెకరేషన్‌.. సన్నాయి ఇలా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేటెడ్‌ అయ్యి ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. ఇక వచ్చే గెస్ట్ లకు కూడా అదే కండీషన్‌ ను పెడుతున్నారు.

రాబోయే రోజుల్లో జనాలు బయట కనిపిస్తే వ్యాక్సిన్‌ వేసుకున్నారా లేదా అనే ప్రశ్న ఎదురు కాబోతుంది. వివాహాది శుభకార్యాలకు హాజరు అవ్వాలనుకునే వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. వ్యాక్సిన్ తీసుకోని వారిని పెళ్లికి ఆహ్వానించినా.. పెళ్లిలో వ్యాక్సిన్ తీసుకోని వారు ఉన్నా కూడా వివాహ వేడుక నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు ముందు ముందు నిర్ణయాలు ఉండబోతున్నాయని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ పై ఆసక్తి కనబర్చడంతో పాటు కార్యక్రమాలకు కూడా అంతరాయం ఉండదని నిపుణులు అంటున్నారు.