Begin typing your search above and press return to search.

దేశంలో మరోసారి 50 వేలు దాటిన కేసులు …24 గంటల్లో ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   25 Jun 2021 6:30 AM GMT
దేశంలో మరోసారి 50 వేలు దాటిన కేసులు …24 గంటల్లో ఎన్నంటే ?
X
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్‌ కొంత తగ్గి సాధారణ జనజీవనం ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సమయంలో మరో కొత్త వేరియంట్ ముప్పు పంచుకు కూర్చుంది. ముఖ్యంగా కరోనా రెండో వేవ్‌ కు కారణమైన డెల్టా వేరియంట్ మరింత శక్తివంతమైన ప్రభావంతో డెల్టా ప్లస్‌ గా మారినట్టు ఇటివలే వెల్లడించారు . అయితే ఈ వేరియంట్ చాలా ప్రమాదకరంగా మారుతోందని, దీని భారిన పడిన వారి పక్క నుండి, మాస్క్‌ పెట్టుకోకుండా వెళ్లినా మహమ్మారి భారిన పడే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ డైరక్టర్ రణదీర్ గులేరియా హెచ్చరించారు.

ఇదిలా ఉంటే....దేశంలో గత 24 గంటల్లో 51,667 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం, నిన్న 24 గంట‌ల్లో 64,527 మంది కోలుకున్నారు. మనదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,34,445కు చేరింది. ఇక మరణాల విషయానికొస్తే, నిన్న‌ 1,329 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం కరోనా మృతుల సంఖ్య మొత్తం 3,93,310కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,91,28,267 మంది కోలుకున్నారు. 6,12,868 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 30,79,48,744 వ్యాక్సిన్ డోసులు వేశారు.

ఇకపోతే, దేశంలోని ఈ వేరియంట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ రాష్ట్రాలతో పాటు మన పక్కరాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుతోపాటు కశ్మీర్‌ లో కూడా ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్రాలో ఈ వైరస్ భారిన 21 మంది పడ్డారు. ఆ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే లాక్‌ డౌన్ నిబంధనలు, సడలిస్తున్న సమయంలో ఇది బయటపడడం స్థానిక ప్రజలతో పాటు దేశవ్యాప్తం గా ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యం లోనే కరోనా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మాస్క్‌ తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పారు.