Begin typing your search above and press return to search.
దేశంలో కొత్తగా 84,332 పాజిటివ్ కేసులు !
By: Tupaki Desk | 12 Jun 2021 5:30 AM GMTదేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ జోరు రోజురోజుకి తగ్గుముఖం పడుతుంది. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్లు, ఆంక్షల ఫలితంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొంచెం కొంచెంగా అదుపులోకి వస్తోంది. అయితే , కరోనా మరణాలు మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం 19,20,477 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 84,332 కొత్త కేసులు వెలుగుచూశాయి. వరుసగా ఐదోరోజూ లక్ష దిగువనే కేసులు నమోదయ్యాయి. 90 వేల దిగువకు కేసులు నమోదు కావడం ఈ నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం.
దేశంలో వైరస్ ఉద్ధృతి ఏప్రిల్ ప్రారంభం నాటి స్థాయికి తగ్గింది. అయితే గత మూడు రోజులుగా మరణాల్లో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. పలు రాష్ట్రాలు మరణాల లెక్కను సవరిస్తుండటంతో ఈ సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో మరో 4,002 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,93,59,155కి చేరగా.. 3,67,081 మంది బలయ్యారు. ఇక నిన్న ఒక్కరోజే 1,21,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సుమారు నెల రోజులుగా కొత్త కేసులు కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. అలాగే 2.79 కోట్ల మందికిపైగా వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రికవరీ రేటు 95.07 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 3.68 శాతానికి తగ్గింది. ఇప్పటివరకు మొత్తం 24,96,00,304 మందికి వ్యాక్సిన్లు వేశారు.