Begin typing your search above and press return to search.

జైలులో కరోనా విజృంభణ ... 70 మంది ఖైదీలకి, ఐదుగురు సిబ్బందికి పాజిటివ్ !

By:  Tupaki Desk   |   8 Jun 2021 8:30 AM GMT
జైలులో కరోనా విజృంభణ ... 70 మంది ఖైదీలకి, ఐదుగురు సిబ్బందికి పాజిటివ్ !
X
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. కాగా, నెలక్రితం భారీగా నమోదైన కేసులు, మరణాలు కాస్త ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలోని గునుపూర్ సబ్ జైలులో కరోనా అలజడి సృష్టించింది. సబ్ జైలులో 113 మంది ఖైదీలుండగా వారిలో 70 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఖైదీలతో పాటు మరో ఐదుగురు జైలు ఉద్యోగులకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తుంది. జైలులో ఎక్కువ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

జైలు ఆవరణ మొత్తన్ని శానిటైజ్ చేయించి, కరోనా సోకిన వారిని ఐసోలేషన్ లో ఉంచినట్లు జైలు సూపరింటెండెంట్ కామాక్ష్య ప్రసాద్ పాటి తెలిపారు. ఒడిశా జైళ్లలో తాజాగా మొత్తం 816 మందికి కరోనా సోకిందని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒడిశాలోని పలు జైళ్లలో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, పలు జైళ్ల నుంచి 654 మందిని ఇతర జైళ్లకు మార్చినట్లు అధికారులు వెల్లడించారు. జైళ్లలో కరోనా ప్రబలుతున్న దృష్ట్యా అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నామని ఒడిశా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే .. ఒడిశాలో గత 24 గంటల్లో 6,118 కరోనా కేసులు నమోదు కాగా 41 మంది మరణించారు. కరోనా కేసుల పెరుగుదలతో జూన్ 17వతేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.