Begin typing your search above and press return to search.

భారత్ లో కరోనా తగ్గుముఖం ... ఒక్కరోజులో ఎన్ని కేసులంటే ?

By:  Tupaki Desk   |   7 Jun 2021 5:31 AM GMT
భారత్ లో కరోనా తగ్గుముఖం ... ఒక్కరోజులో ఎన్ని కేసులంటే ?
X
కరోనా వైరస్ మహమ్మారి జోరు దేశంలో కొనసాగుతోంది. అయితే , గత కొన్ని రోజులుగా నమోదు అయ్యే కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. ఒకప్పుడు నాలుగు లక్షలకి పైగా నమోదు అయిన కరోనా కేసులు ప్రస్తుతం లక్ష కి వచ్చాయి. అలాగే కరోనా మహమ్మారి మరణాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే .. తాజాగా దేశంలో కొత్త‌గా 1,00,636 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,89,09,975 కి చేరింది. ఇందులో 2,71,59,180 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,01,609 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

ఇక ,గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2427 మంది మృతిచెందారు. దీనితో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,49,186 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 1,74,399 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌పోతే, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 23,27,86,482 మందికి వ్యాక్సిన్ అందించారు. దేశంలో మరణాల రేటు 1.2 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.15 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 1,74,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,71,59,180కి చేరింది. రికవరీ రేటు 93.7 శాతం నుంచి 93.9 శాతానికి పెరిగింది. ప్రస్తుతం భారత్‌లో 14,01,609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 15,87,589 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 36 కోట్ల 63 లక్షల 34 వేల 111 టెస్టులు చేశారు. కొత్తగా 13,90,916 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 23కోట్ల 27లక్షల 86వేల 482 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.