Begin typing your search above and press return to search.
కరోనా : దేశంలో కొత్తగా 1.34 లక్షల కేసులు .. 2887 మరణాలు !
By: Tupaki Desk | 3 Jun 2021 7:30 AM GMTభారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. అయితే , సెకండ్ వేవ్ లో మొదట్లో నాలుగు లక్షలకి పైగా కరోనా కేసులు నమోదు కాగా , గత కొన్ని రోజులుగా ఆ సంఖ్య లక్షన్నర కి దిగొచ్చింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,34,154 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,41,986కి చేరింది. వీటిలో 17,13,413 యాక్టివ్ కేసులు ఉండగా, 2,63,90,584 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మన దేశంలో తమిళనాడులోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. తమిళనాడులో 25,317 మందికి కరోనా నిర్ధారణ అయింది. కేరళలో 19,661, కర్నాటకలో 16,387, మహారాష్ట్రలో 15,169 కేసులు వచ్చాయి.
అలాగే , నిన్న 2887 మంది కరోనా వైరస్ తో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 3,37,989కి చేరుకుంది. నిన్న కొత్తగా 2,11,499 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే నిన్న ఒక్క రోజులో 21,59,873 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగినట్లు ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ తెలిపింది. దీనితో ఇప్పటివరకు మొత్తంగా 35,37,82,648 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. అటు ఇప్పటిదాకా 22,10,43,693 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం దేశంలో డిశ్చార్జ్ రేట్ 92.79 శాతం, డెత్ రేట్ 1.19 శాతంగా ఉంది.