Begin typing your search above and press return to search.

దేశంలో కొత్తగా 1,27,510 క‌రోనా కేసులు .. మరణాలు ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   1 Jun 2021 6:32 AM GMT
దేశంలో కొత్తగా  1,27,510 క‌రోనా కేసులు .. మరణాలు ఎన్నంటే ?
X
దేశంలో గత కొన్ని రోజుల పాటు అలజడి సృష్టించిన కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ .. గత ముడు , నాలుగు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. దేశంలో ఆదివారం 1,65,553 కొత్త కరోనా కేసులు రాగా , సోమవారం 1,27,510 వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,81,75,044కి చేరింది. కొత్తగా శనివారం 3,617 మంది చనిపోగా , ఆదివారం 3,460 మంది చనిపోయారు. సోమవారం 2,795 మంది చనిపోయారు. మరణాల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. తాజాగా 19,25,374మందికి కరోనా నిర్ధారణ టెస్టులు చేయ‌గా.. 1,27,510 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ముందు రోజుతో పోల్చుకుంటే 16 శాతం తగ్గుదల కనిపించడం ఊర‌ట‌నిచ్చే అంశం. వరుసగా ఐదోరోజు కేసులు తగ్గుముఖం పట్టాయి.

అలాగే తాజాగా మరో 2,795 మంది ప్రాణాలు వదిలారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 2,81,75,044మంది వైరస్ సోక‌గా 3,31,895మంది మ‌హ‌మ్మారి వ‌ల్ల క‌న్నుమూశారు . ప్రస్తుతం 18,94,520మంది కొవిడ్‌తో చికిత్స తీసుకుంటూ ఉండ‌గా, యాక్టివ్ కేసుల రేటు 7.22 శాతానికి పడిపోయింది. సోమ‌వారం ఒక్కరోజే 2,55,287మంది కరోనా నుంచి రిక‌వ‌ర్ అయ్యారు. మొత్తంగా 2.59కోట్ల మందికిపైగా వైరస్‌ ను జయించగా రికవరీ రేటు 91.60శాతానికి చేరింది. టీకా డ్రైవ్‌ లో 21,60,46,638 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. నిన్న ఒకే రోజు 19,25,374 కొవిడ్‌ శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఈ నెల 31వ తేదీ వరకు మొత్తం 34,67,92,257 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.