Begin typing your search above and press return to search.
మొన్న కరోనా .. నిన్న బ్లాక్ ఫంగస్ ..నేడు ‘గ్యాంగ్రిన్’ !
By: Tupaki Desk | 25 May 2021 12:30 AM GMTదేశంలో రోజుకో కొత్త వ్యాధి వెలుగులోకి వస్తుంది. ఓ వైవు కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ సెకండ్ వేవ్ లో రోజూ లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే వేల సంఖ్యలో కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మహమ్మారి భాధ నుండి బయటపడకమునుపే .. బ్లాక్ ఫంగస్ భయపెట్టడం మొదలెట్టింది. ఈ బ్లాక్ ఫంగస్ కేసులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్నాయి. బ్లాక్ ఫంగస్ సోకితే.. కంటి చూపును కోల్పోయే ముప్పుతో పాటు మొత్తం దవడనే తీసేయాల్సి రావచ్చు. తాజాగా మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వారికి గ్యాంగ్రిన్ రూపంలో మరో గండం ఎదురవుతోంది.
గ్యాంగ్రిన్ చుట్టుముడితే, అది వ్యాపించిన కాళ్లు, చేతులను తొలగించాల్సి వస్తుంది. ఈ సమస్యతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య మార్చి నుంచే క్రమంగా పెరుగుతోందని గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ మనీశ్ రావల్ ఓ ఆంగ్ల టీవీ చానల్ కు తెలిపారు. గ్యాంగ్రిన్ బాధితుల్లో ఎక్కువ మంది కరోనా వైరస్ నుండి కోలుకున్న వారేనన్నారు. ఈ ఆరోగ్య సమస్యకు ప్రధాన కారణం త్రాంబోసిస్ అని ఆయన తెలిపారు. కరోనా నుండి కోలుకున్న కొందరిలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు క్షీణించి త్రాంబోసిస్ కు దారితీస్తోందన్నారు. ఫలితంగా బాధితుల రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతోందని , ధమనులు గుండె నుంచి వివిధ శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్తాయని అన్నారు. ఉదాహరణకు కాలిలోని ఒక ధమని త్రాంబోసిస్ తో ప్రభావితమైతే.. మొత్తం కాలు బరువుగా, మొద్దుబారినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత కాలు పూర్తిగా చల్లబడిపోతుంది. కాలు తొలుత నీలిరంగుకు, తర్వాత ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఈ స్థితినే గ్యాంగ్రిన్ అంటారు. దీని లక్షణాలను గుర్తించిన గంట నుంచి ఆరు గంటల్లోగా చికిత్స చేయించుకోవాలి. లేదంటే ఆ కాలును తీసేయాల్సి రావచ్చు అని ఓ డాక్టర్ వివరించారు.