Begin typing your search above and press return to search.

కరోనా : కేసులు తగ్గుతున్నాయ్ .. మరణాలు పెరుగుతున్నాయి

By:  Tupaki Desk   |   19 May 2021 5:30 AM GMT
కరోనా : కేసులు తగ్గుతున్నాయ్ .. మరణాలు పెరుగుతున్నాయి
X
మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ జోరు కొనసాగుతోంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే రోజురోజుకి దేశంలో నమోదు అయ్యే కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంటే , కరోనా మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూపోతోంది. తాజాగా మంగళవారం అత్యధికంగా 4,525 మంది చనిపోయారు. మరోవైపు కొత్తగా 25,495,144 కేసులు నమోదు అయ్యాయి. ఏప్రిల్‌ 20 తర్వాత ఇవే అత్యల్పం. కాగా, మే 6న నమోదైన 4.14 లక్షల అత్యధిక కేసులకు ఇవి దాదాపు 30ు తక్కువ. వరుసగా రెండో రోజు కేసులు 3 లక్షల లోపే ఉన్నాయి. లక్షపైన యాక్టివ్‌ కేసులున్న రాష్ట్రాల సంఖ్య గత వారం వరకు 12 ఉండగా ,ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిదికి తగ్గింది. సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న మహారాష్ట్రలో 26 వేల కేసులే వచ్చా యి.

ఇక , కేరళ లో 21,400 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఢిల్లీలో మూడో రోజూ 5 వేల లోపునే నమోదయ్యాయి. అయితే, కర్ణాటక 38,603, తమిళనాడు 33,075 లో ఉధృతి కొనసాగుతోంది. వీటితోపాటు పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిసాల్లో 10 వేల నుంచి 20 వేల మధ్య కేసులు వచ్చాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2.52 కోట్లు దాటింది. ప్రపంచంలో అమెరికా తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్‌లు నమోదైంది మన దేశంలోనే. ఓవైపు కేసులు తగ్గుతుండగా మృతుల సంఖ్య భారీగా ఉంటోంది. ఇలా ఎందుకనే దానిపై సందేహాలు వస్తున్నాయి.దేశ జనాభాలో ఇప్పటివరకు వైరస్‌ బారిన పడినవారి శాతం 1.8 మాత్రమేనని.. ఇంకా 98 శాతంపైగా ప్రజలకు కరోనా ముప్పు పొంచే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే, కొవిడ్‌ 2 శాతం మందికి వ్యాపించే లోగానే కట్టడి చేయగలమని తెలిపింది. శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 199 జిల్లాల్లో మూడు వారాలుగా కేసులు తగ్గుతున్నట్లు తెలిపారు