Begin typing your search above and press return to search.

ముందున్నవన్నీ మంచిరోజులేనట.. ఆర్నెల్లలో దేశంలోని ఇన్ని టీకాలు

By:  Tupaki Desk   |   14 May 2021 11:30 AM GMT
ముందున్నవన్నీ మంచిరోజులేనట.. ఆర్నెల్లలో దేశంలోని ఇన్ని టీకాలు
X
జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది. చేయకూడని పొరపాట్లు ఎన్నింటినో చేసింది కేంద్రంలోని మోడీ సర్కారు. ఎవరెన్ని అన్నా.. ఎంత తిట్టినా జరిగిపోయిన డ్యామేజ్.. జరుగుతున్న నష్టాన్ని ఆపే పరిస్థితి అయితే లేదు. కాకుంటే.. ఫ్యూచర్ విషయం మీదనైనా జాగ్రత్తగా ఫోకస్ పెడితే.. ఇప్పుడున్న దారుణ పరిస్థితి నుంచి తప్పించుకునే వీలుంది. దేశంలో కరోనా టీకాల కొరత కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్న కేంద్రం.. ఇప్పుడు వాటిని సమకూర్చుకోవటంపై ఇప్పుడు ఫోకస్ పెడుతున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. టీకా కొరతపై దేశ వ్యాప్తంగా పెరుగుతున్న విమర్శలు.. ఆందోళనకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రకటన ఉండటం గమనార్హం.

తాజాగా చేసిన ప్రకటన ప్రకారం.. త్వరలో కొత్త టీకాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. రష్యాకు చెందిన స్పూత్నిక్ - వి వ్యాక్సిన్ వచ్చే వారమే దేశీయ విపణిలోకి అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని వెల్లడించారు. మరోమూడు నుంచి ఆర్నెల్ల వ్యవధిలో దేశంలోని పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని.. ఇవన్నీ కలిపితే దాదాపు 216 కోట్ల డోసులు ఉంటాయని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ చెప్పటం గమనార్హం.

అంతేకాదు.. భారత్ బయోటెక్ కు చెందిన సింగిల్ డ్రాప్ నోసల్ టీకా మీద కూడా ఆయన వ్యాఖ్య ఉండటాన్ని మర్చిపోకూడదు. దేశంలో ఇప్పటివరకు 13.7 కోట్ల మంది మొదటి డోస్ వేయించుకున్నారని.. 3.96 కోట్ల మంది సెకండ్ డోస్ వేసుకున్నారన్నారు. దేశంలో 45 ఏళ్లు దాటిన వారు 34కోట్ల మంది ఉంటే.. వారిలో మూడో ఒక వంతు మందికి డోసు అందిందని.. కొవిడ్ మరణాల్లో 88 శాతం ఇదే వయస్కులన్నారన్నారు.

ఇప్పటివరకు 35.6 కోట్ల డోసులు కొనుగోలు చేశామని.. మిగిలిన 16 కోట్ల డోసుల్ని మే - జులై మధ్యలో అందుతాయని.. అందుకు సంబంధించిన పేమెంట్ పూర్తి అయినట్లు చెబుతున్నారు. మొత్తంగా జులై నాటికి 51.6 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. రాబోయే మూడు నుంచి ఆర్నెల్ల వ్యవధిలో దేశంలోకి వచ్చే వివిధ రకాల టీకాలకు సంబంధించిన వివరాలు.. వాటి డోసుల లెక్కను వెల్లడించారు. వాటి ప్రకారం చూస్తే..

కంపెనీ కోట్లలో డోసులు
కొవిషీల్డ్ 75
కొవాగ్జిన్ 55
బయోలాజికల్ - ఇ 30
సీరమ్ - నోవావ్యాక్స్ 20
స్పుత్నిక్ - వి 15.6
భారత్ బయోటెక్ ముక్కు టీకా 10
జైనోవా ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ 6
జైడస్ క్యాడిలా 5