Begin typing your search above and press return to search.
మోడీ ఇమేజ్‌ను దెబ్బ తీసేవి ఇవేనా?
By: Tupaki Desk | 12 May 2021 9:30 AM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ ఇప్పుడు ఘోరంగా పడిపోయింది. అన్ని వైపుల నుంచి ఆయనను విమర్శించేవారు పెరుగుతున్నారు. ఒకప్పుడు మోడీని దేవుడని.. ఆయన ఒక ఐకాన్ అని.. పేర్కొన్న వారే.. ఇప్పుడు మోడీ వేస్ట్ అని అనేస్తున్నారు. ఎలాంటి సంకోచం లేకుండా.. సోషల్ మీడిలో పెద్ద ఎత్తున విమర్శ లు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా రెండో దశవ్యాప్తికి.. ఎవరు రీజన్ అన్న విషయాన్ని పరిశీలిస్తే.. మెజారిటీ ప్రజలు మోడీ సహా.. కేంద్రంలోని పెద్దలవైపే వేళ్లు చూపిస్తుండడం గమనార్హం.
వ్యాప్తి వెనుక!
సెకండ్ వేవ్ పొంచి ఉంది.. జాగ్రత్తగా ఉండాలని .. ఈ ఏడాది జనవరిలోనే నిపుణులు మోడీ సర్కారుకు సమాచారం ఇచ్చారు. అయితే.. అప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించి.. తాము తొలి దశ కరోనా విషయంలో సాధించిన విజయాన్ని క్యాష్ చేసుకునేందుకు మోడీ సర్కారు వ్యూహాలు సిద్ధం చేసుకుంది. దీంతో రెండో దశపై.. ఎవరెన్ని చెప్పినా.. వినిపించుకోకుండానే.. ఎన్నికలకు వెళ్లడం.. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తికి దారితీసిందనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.
రాష్ట్రాలను పట్టించుకోక పోవడం
తొలి దశ కరోనా సమయంలో ఎవరినీ అడగకుండానే సెడన్‌గా ప్రధాని లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఆహారం, నీరు లభించక మృతి చెందారు. ఇక, రాష్ట్రాలు సైతం జీడీపీలో తమ వాటా తగ్గిపోయి.. అలమటించే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సమయంలో ఆదుకోవాల్సిన మోడీ.. నిధులు ఇచ్చేందుకు మీన మేషాలు లెక్కపెట్టారు. కేంద్రం తీసుకున్న పథకాలను అమలు చేస్తే.. అప్పులు చేసుకునేందుకు అవకాశం ఇస్తామన్నారు. ఇలా.. ఆర్థికంగా రాష్ట్రాలను పట్టించుకోలేదనే ప్రచారం మోడీ వైపు ఉంది.
గెలుపే పరమావధి
ఒకవైపు కరోనా పొంచి ఉందని తెలిసినా.. తనే స్వయంగా ఎన్నికల ప్రచారంలోకి దిగిన.. మోడీ.. లక్షల సంఖ్యలో ప్రజలను ఒక గాటకు చేర్చి.. ప్రసంగాలు గుప్పించారు. నిజానికి కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసుకోవాలని.. పలువురు సూచించినా.. మోడీ పట్టించుకోకుండా. తొలి వేవ్‌లో ఎదురైన.. విజయంతో ఇక, మనకు సెకండ్ వేవ్ రాదనే అతి ధైర్యం.. ఎన్నికల్లో గెలుపు ఖాయమనే అతి విశ్వాసం.. వంటివి మోడీని వైఫల్యాల దిశగా అడుగులు వేయించాయని అంటున్నారు పరిశీలకులు.
వ్యాక్సిన్ విషయంలో!
కరోనా వ్యాక్సిన్ విషయంలో.. ప్రధాని మోడీ అనుసరించిన విధానం కూడా.. తీవ్ర విమర్శలకు అవకాశం ఇచ్చింది. దేశీయంగా తయారైన వ్యాక్సిన్ కు ఆర్థికంగా దన్నుగా నిలవడంలో మోడీ పూర్తిగా విఫలమ య్యారు. అంతేకాదు.. ఉత్పత్తి పెంపుపై కూడా దృష్టి పెట్టకుండా.. తన ఆత్మనిర్భరతను ప్రపంచ దేశాలకు ప్రచారం చేసుకునేందుకు ఈ పథకం కింద.. వేలాది వ్యాక్సిన్ కిట్లు ఎగుమతి చేశారు. ఇది తీవ్ర పరిణామాలకు మారింది. దేశంలో అవసరం వచ్చే సరికి ఇతర దేశాలను అర్ధించాల్సి వచ్చింది.
ప్రచారం రివర్స్!
ఒకప్పుడు సోషల్ మీడియాలో తనపై తెగ అనుకూల ప్రచారం చేసుకున్న నరేంద్ర మోడీకి ఇప్పుడు ఇదే సోషల్ మీడియా కాకరేపుతోంది. ఒకప్పుడు.. తనను పొగిడిన నోళ్లే.. ఇప్పుడు విరుచుకుపడుతున్నాయి. అది కూడా సోషల్ మీడియాలో కావడంతో సదరు మోడీ సర్కారు తీవ్రస్థాయిలో ఇరుకున పడుతోంది. మరి మున్ముందు ఏం చేస్తారో చూడాలి.