Begin typing your search above and press return to search.
ఫస్ట్ వేవ్ లో మోడీ జయహో! సెకండ్ వేవ్ లో మోడీ తుస్సుహో!
By: Tupaki Desk | 12 May 2021 1:30 PM GMTకరోనా విషయంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యవ హార శైలి వివాదాస్పదంగా మారింది. గత ఏడాది మార్చి సమయంలో దేశంలో ఒకటి రెండు కరోనా కేసులు వెలుగు చూసిన తర్వాత.. వెంటనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. ఇక, ప్రపంచంలోనే అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్న దేశంగా.. కరోనా వ్యాప్తి, మరణాల రేటు కూడా తక్కువగా ఉన్న దేశంగా .. ప్రధా ని ప్రొజెక్ట్ చేశారు. ప్రపంచంలో అనేక దేశాలు కరోనాతో అల్లాడి పోతున్నాయని.. కానీ.. తాను తీసుకున్న నిర్ణయం కారణంగా.. ఇబ్బందులు తగ్గాయని.. అంటున్నారు.
ఇక, దేశంలో లాక్‌డౌన్ అమలవుతున్న తరుణంలోనే.. ప్రజలను గుమ్మాల వద్ద దీపాలు పెట్టాలని, పళ్లేలు మోగించాలని.. చప్పట్లు చరిచి.. ఫ్రంట్ వారియర్స్‌కు మద్దతుగా నిలవాలని కూడా ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. ఇక, నెలనెలా చివరి ఆదివారం.. ప్రధాని నిర్వహించే `మన్ కీ బాత్..`లోనూ కరోనాను తమ ప్రభు త్వం ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటోందో.. కూడా చాటుకున్నారు. ఇక, ప్రపంచ దేశాలు సైతం భార త్‌ను చూసి నేర్చుకుంటున్నాయని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇక, బీజేపీ నేతలు.. ప్రధాని మోడీని పొగిడేపనిలో పడ్డారు.
అయితే.. కరోనా సెకండ్ వేవ్ కు వచ్చే సరికి మాత్రం దేశవ్యాప్తంగా కరోనా మృతులు నానాటికీ పెరుగుతు న్నాయి. ఎక్కడికక్కడ వైద్యం అందక ప్రజలు విలవిల్లాడుతున్నారు. వైద్య శాలలు సరిపోవడం లేదు. శ్మశానాల్లోనూ ఖాళీ లేదనే బోర్డులు పెట్టారు. మరి ఇంత జరుగుతున్న మోడీ సర్కారు.. ప్రజలకు పూర్తిస్థా యిలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఎక్కడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అదేసమయంలో రాష్ట్రాలకు కూడా తానే వాటా నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. ఇదంతా ఒక ఎత్తయితే.. మరోవైపు.. ఆక్సిజన్ కొరత కూడా వెంటాడుతోంది.
ఇక, ఇప్పటి వరకు ప్రధాని పల్లవించిన ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సెకండ్ వేవ్‌పై ముందుగానే తాము హెచ్చరించామని..అ యినా మోడీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందని.. ఐఎంఏ.. వంటి కీలక సంస్థలు నిప్పులు చెరిగాయి. ఇక, విదేశీ పత్రికలు , దేశాధి నేతలు కూడా.. మోడీ విధానాలపై విరుచుకుపడుతున్నారు. దేశంలో 0.2 శాతం టీకాలు ఇచ్చి.. విదేశాలకు 6.5శాతం టీకాలను ఉచితంగా ఎగుమతి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని.. మరికొన్ని పత్రికలు నిలదీశాయి. ఇలా.. మొత్తంగా చూస్తే.. ఫస్ట్ వేవ్ లో భుజకీర్తులు తొడుక్కున్నా.. సెకండ్ వేవ్కు వచ్చే సరికిమాత్రం.. గూడలు విరిగిపోతున్నాయి.. మోడీ సర్కారుకు!! అంటున్నారు పరిశీలకులు.