Begin typing your search above and press return to search.

క‌రోనా అల‌ర్ట్ః ఈ ల‌క్ష‌ణాలు చాలా డేంజ‌ర్‌!

By:  Tupaki Desk   |   11 May 2021 4:30 PM GMT
క‌రోనా అల‌ర్ట్ః ఈ ల‌క్ష‌ణాలు చాలా డేంజ‌ర్‌!
X
దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. ఎంతో మంది అభాగ్యులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల‌తో ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో? ఎవ‌రికి పాజిటివ్ వ‌చ్చింద‌న్న చెడు వార్త వినాల్సి వ‌స్తుందో..? ఎవ‌రు మ‌ర‌ణించార‌న్న దుర్వార్త చెవిన ప‌డుతుందోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

అయితే.. క‌రోనా మృతుల్లో ‘హ్యాపీ హైపోక్సియా’ లక్షణాలు కనిపిస్తుండడం ఇప్పుడు అంద‌రినీ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. కొవిడ్ పాజిటివ్ వ‌చ్చినా.. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండేవారికి మైల్డ్ కొవిడ్ వ‌చ్చిన‌ట్టుగా చెప్పేవారు. అంటే.. పెద్ద‌గా ప్ర‌మాదం లేద‌న్న‌ట్టుగా చెప్పేవారు. అయితే.. ఇదే విధంగా స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండి, అక‌స్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న‌వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంద‌ట‌.

ఈ ప‌రిస్థితిని హ్యాపీ హైపోక్సియా గా పిలుస్తార‌ని వైద్యులు చెబుతున్నారు. అంటే.. కొవిడ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. పెద్ద‌గా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. మంచిగా యాక్టివ్ గానే ఉన్న‌ట్టు క‌నిపిస్తారు. కానీ.. ఆక్సీజ‌న్ స్థాయి వేగంగా ప‌డిపోతుంద‌ట‌. ఆరోగ్య‌వంతుల‌కు 95 శాతానికిపైగా ఆక్సీజ‌న్ ఉండాల‌న్న సంగ‌తి తెలిసిందే.

అయితే.. ఆ శాతం వేగంగా 90కి ప‌డిపోతుంద‌ట‌. అలా త‌గ్గిన‌ప్పుడు మెద‌డుకు అందాల్సిన ఆక్సీజ‌న్ క్ర‌మంగా త‌గ్గిపోయింది వెంట‌నే ప్ర‌భావం చూపుతుంద‌ట‌. దీంతో.. ఉన్న‌ట్టుండి చ‌నిపోతార‌ట‌. ఈ హ్యాపీ హైపోక్సియా కేసులు బాగా పెరుగుతున్నాయ‌ని చెబుతున్నారు. అందువ‌ల్ల‌.. ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వైద్యుల‌ను కాంటాక్ట్ అయ్యి, వారి సూచ‌న‌ల మేర‌కు చికిత్స తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.