Begin typing your search above and press return to search.

మే చివరినాటికి కరోనా తగ్గుముఖం..!

By:  Tupaki Desk   |   8 May 2021 11:30 PM GMT
మే చివరినాటికి కరోనా తగ్గుముఖం..!
X
దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. అధికారులు ఏం లెక్కలు చెబుతున్నారు. శ్మశానాల్లో ఎన్ని కాష్టాలు కాలుతున్నాయి అన్న లెక్కను పక్కను పెడితే.. మనకు తెలిసిన వాళ్లల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మందికి కరోనా సోకుతోంది. గత ఏడాది కంటే .. ఈ సారి పరిస్థితి దారుణంగా ఉంది. వ్యాక్సిన్​ డోసుల కోసం ప్రజలు క్యూలైన్లలో ఎగబడుతున్నారు. దీన్ని బట్టి కరోనా భయం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే రోజుకు 4 లక్షల పై చిలుకు కేసులు నమోదవుతున్నట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని కొందరు డాక్టర్లు అంటున్నారు.చాలా మందికి ఆక్సిజన్​ సైతం అందడం లేదు. దేశంలో వెంటనే ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించాలన్న డిమాండ్​ తెరమీదకు వస్తున్నది. ప్రధాని నరేంద్రమోదీ వైఖరిపై అంతర్జాతీయ మీడియా సైతం దుమ్మెత్తి పోస్తున్నది. విదేశీ పత్రికలు మన దేశ పరిస్థితిని చూసి జాలి పడుతున్నాయి. ఆఖరికి పాకిస్థాన్​, శ్రీలంక వంటి చిన్న దేశాలు సైతం భారత్​మీద జాలి చూపిస్తున్నాయంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు.

దేశంలో కరోనా కేసులు ఎప్పటికి తగ్గుతాయి. పరిస్థితి ఎప్పటికి అదుపులోకి వస్తుంది అన్న విషయంపై పలువురిలో ఆందోళన నెలకొన్నది. దీనిపై సైంటిస్టులు భిన్నంగా స్పందిస్తున్నారు. తాజాగా ఓ శాస్త్రవేత్త ఊరటనిచ్చే విషయాన్ని చెప్పారు. ఈ నెల చివరినాటికి మనదేశంలో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. దీంతో చాలా మంది ఊరట చెందుతున్నారు. మే నెల చివరినాటికి కరోనా వైరస్​ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని.. ప్రముఖ వైరాలజిస్ట్​ గగన్​ దీప్​ పేర్కొన్నారు. ఆమె ప్రస్తుతం వేలూర్ మెడిక‌ల్ కాలేజ్ లో ఒక విభాగాధిప‌తి పనిచేస్తున్నారు. ఈమె పిల్ల‌ల్లో సోకే రొటా వైర‌స్ కు ఆమె గతంలో వ్యాక్సిన్ కనిపెట్టారు.

అంతేకాక బ్రిట‌న్ లోని రాయ‌ల్ సొసైటీ ఫెలోషిప్ ను పొందిన తొలి భార‌తీయ మ‌హిళ‌. రొటా వైర‌స్ కు ఈమె క‌నిపెట్టిన వ్యాక్సిన్ వ‌ల్ల ప్ర‌తియేటా వేలమంది చిన్నారుల ప్రాణాలు నిల‌బడుతున్నాయి. అయితే గతంలో చాలా మంది అధ్యయనకారులు కూడా కరోనా వైరస్​ త్వరలోనే తగ్గుముఖం పడుతుందని చెప్పారు. జూన్​ ప్రథమార్థంలో కరోనా తగ్గే అవకాశం ఉందని కొందరు చెప్పారు. అయితే ప్రస్తుతం ఓ వైరాలజిస్ట్​ ఈ విషయం చెప్పడంతో భరోసా నెలకొన్నది.