Begin typing your search above and press return to search.
దారుణం : ఇంటి నుండి ఆస్పత్రికి అంబులెన్స్ బిల్లు లక్షా 20 వేలు !
By: Tupaki Desk | 8 May 2021 3:15 AM GMTకరోనా మహమ్మారి దెబ్బకి మొత్తం ప్రపంచం అల్లాడిపోతుంటే , ఇదే అదునైన సమయం , ఇంతకంటే మంచి సమయం ఇక రాదు అని భావించిన కొందరు కేటుగాళ్లు మాత్రం కరోనా ను క్యాష్ చేసుకుంటున్నారు. సమయం చిక్కిందని అందినకాడికి దోచుకుంటున్నారు. కరోనా రోగుల వైద్యం నుండి తరలింపు వరకు లక్షల్లో డిమాండ్ చేస్తూ ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. మానవత్వం మరచి కాసులకు కక్కుర్తి పడుతున్నారు. కరోనా రోగిని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్ భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. 350 కిలో మీటర్ల దూరానికి రూ.లక్షా 20 వేలు వసూల్ చేశాడు. దానికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేవలం మూడు వందల యాబై కిలోమీటర్లకు అంత బిల్లు వేయడం పై నెటిజన్లు మండిపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ఉన్న బాధితులపై కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. హరియాణాలోని గురుగ్రామ్ నుంచి కరోనా బాధితుడిని తీసుకుని పంజాబ్‌లోని లూదియానా వరకు వెళ్లాల్సి ఉంది. అయితే దాని దూరం మొత్తం 350 కిలోమీటర్లు ఉంది. దీంతో అంబులెన్స్ ను మాట్లాడగా డ్రైవర్ రూ.లక్షా 40 వేలు ఇవ్వమని అడిగాడట, అయితే ఆక్సిజన్ కరోనా భాదితుని వద్ద ఉండడంతో ఓ ఇరవై వేలు తగ్గించారు. సోమవారం ఎట్టకేలకు గురుగ్రామ్ నుంచి లూదియానాకు కరోనా బాధితుడిని అంబులెన్స్ డ్రైవర్ తీసుకువచ్చాడు. మొత్తం 350 కిలో మీటర్ల ప్రయాణానికి గాను బాధితుడు లక్ష ఇరవై వేలు చెల్లించాడు. ఇప్పటివరకు బాగానే ఉన్నా.. ఇంటికి చేరిన అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు..దీంతో ఆ బిల్లును పంకజ్ నైన్ అనే ఐపీఎస్ అధికారి ఈ బిల్లును ట్వీట్ చేశారు. సిగ్గుండాలి అని పేర్కోంటూ.. ఆ బిల్లు ఫొటోను షేర్ చేశారు. దీంతో అంబులెన్స్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. అయితే అధిక మొత్తం ఛార్జీ చేసిన అంబులెన్స్ డ్రైవర్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వాలు అంబులెన్స్ సేవలకు కూడా నిర్ధిష్ట ధరలు ప్రకటించింది. కానీ, కరోనా పేరు చెప్పి లక్షల్లో ఇస్తే కానీ రాము అని మండిపడుతున్నారు. ఇది ఏ ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాదు దేశం మొత్తం ఇదే పరిస్థితి. కరోనా సమయంలో ఆదుకోవాల్సింది పోయి కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. ఇక మరికొందరు నెటిజన్స్ అంబులెన్సులే ఈ రకంగా దోచుకుంటే, ఆసుపత్రులు ఇంకా ఎలా దోచుకుంటున్నాయో అని నెటిజెన్లు మండి పడుతున్నారు.