Begin typing your search above and press return to search.

కరోనా కొత్త స్ట్రెయిన్ తో ప్రపంచానికి ముప్పే .. ఇప్పట్లో తగ్గదట , ఎవరన్నారంటే ?

By:  Tupaki Desk   |   7 May 2021 11:30 AM GMT
కరోనా కొత్త స్ట్రెయిన్ తో ప్రపంచానికి ముప్పే .. ఇప్పట్లో తగ్గదట , ఎవరన్నారంటే ?
X
చైనాలోని వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి గత కొన్ని నెలలుగా మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. పలు రకాలుగా రూపాంతరాలు చెందుతూ కొత్త కొత్త వేరియంట్స్ తో అన్ని దేశాల ప్రజలని ఆందోళనకి గురిచేస్తుంది. ఇక సెకండ్ వేవ్ లో భారత్ కి కరోనా చుక్కలు చూపిస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో నమోదు కానీ కేసులు ఒక్క ఇండియాలోనే నమోదు అవుతున్నాయి. అమెరికా, చైనా, యూకే సహా అంతటా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ తరుణంలో మోడెర్నా ఔషధ కంపెనీ సీఈవో సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఇప్పుడే పోదు , ఇంకా ముందుంది అసలు ముప్పు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరో 6 నెలల్లో కొత్త స్ట్రెయిన్‌ ను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని అమెరికా డ్రగ్ కంపెనీ మోడెర్నా సీఈవో స్టీఫెన్ బన్సల్ పేర్కొన్నారు. దక్షిణాది దేశాల్లో జూన్‌లో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని.. శీతాకాలంలో వైరస్‌ మరింత విజృంభించే అవకాశముందని స్టీఫెన్ బన్సల్ అంచనా వేశారు. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఆసియాలోని కొన్ని దేశాలకు ముప్పు పొంచిఉందని ఆయన అన్నారు. వైరస్ ఇప్పట్లో పోయేలా లేదని అన్నారు. బ్రెజిల్‌ (P.1), సౌతాఫ్రికా (B.1.351) స్ట్రెయిన్లను తట్టుకునేలా కొత్త వ్యాక్సిన్‌ ను రూపొందించినట్లు మోడెర్నా ఇటీవలే ప్రకటించింది. అంతలోనే మోడెర్నా సీఈవో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతంలో మోడెర్నా టీకాలు వేసుకున్న కొందరి వ్యక్తులపై బూస్టర్‌ డోస్‌ ను పరీక్షించామని, అద్భుతమైన ఫలితాలు వచ్చాయని కంపెనీ తెలిపింది. బూస్టర్‌ డోసు తీసుకున్న వాలంటీర్లలో వ్యాధినిరోధక శక్తి అనూహ్యంగా పెరిగిందని వెల్లడించింది. ప్రస్తుతం కోవిషీల్డ్, కొవాగ్జిన్ లాగే.. మోడెర్నా టీకాను కూడా నెల రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని వేరియంట్లను అడ్డుకునేందుకు బూస్టర్ డోస్ అవసరం అవుతుందని కంపెనీ తెలిపింది. ఐతే బూస్టర్‌ డోసు అవసరం లేకుండా ఒకేసారి వ్యాక్సిన్‌ ఇచ్చేవిధంగా ప్రయోగాలు జరుపుతున్నామని వెల్లడించింది.