Begin typing your search above and press return to search.
ఐసీయూల్లో బాధితులు ఫుల్ ..ఆస్పత్రుల్లో బెడ్స్ నిల్ !
By: Tupaki Desk | 6 May 2021 7:37 AM GMTదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. తెలంగాణ లో పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. బెడ్లు ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ లోని ప్రైవేట్ , ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్స్ మొత్తం దాదాపుగా ఫుల్ అయ్యాయి. కేవలం రెండు వారాల్లోనే పరిస్థితి తీవ్ర రూపం దాల్చగా , ఎవరైనా కరోనా విషమించి హాస్పిటల్ లో చేరాల్సి వస్తే బెడ్స్ దొరకని పరిస్థితి. అయితే నగరంలో కొన్ని చిన్న చిన్న ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీగా ఉన్నప్పటికీ కూడా కరోనా , ప్రాణ భయంతో ఉన్న బాధితుల నుండి భారీగా సొమ్ము లాగుతున్నారట. అయితే మెడికల్ కాలేజీల్లో ఉన్న బెడ్స్ మొత్తం అందుబాటులోకి తీసుకువస్తే ఈ సమయ కొంతమేర తీరే అవకాశం ఉందని ఉందని నిపుణులు చెప్తున్నారు.
తెలంగాణలో మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల మధ్య 6,026 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 6,551 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,75,748కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,96,042 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,579గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 77,127 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణ లో కరోనా కట్టడి లో భాగంగా రాత్రి కర్ఫ్యూ ను అమలు చేస్తున్నారు. ఇది మే 8 తో ముగియనుంది. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి రాష్ట్రంలో లాక్ డౌన్ వేసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.