Begin typing your search above and press return to search.
బాధ్యతల నుండి తప్పుకున్న మోడి
By: Tupaki Desk | 4 May 2021 7:30 AM GMTకరోనా వైరస్ నియంత్రణ విషయంలో కేంద్రప్రభుత్వం చాలా విచిత్రంగా వ్యవహరిస్తోంది. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నియంత్రణ బాధ్యతను నరేంద్రమోడి సర్కార్ రాష్ట్రప్రభుత్వాలకే వదిలేసింది. కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ విధించే అంశంపై నిర్ణయాలు తీసుకోవాల్సింది రాష్ట్రాలే అని తాజాగా తేల్చేసింది.
మొదటిదశలో ఏమో కరోనాను నియంత్రించే విషయంలో కేంద్రమే లాక్ డౌన్ను విధించింది. కానీ సెకెండ్ వేవ్ విజృంభించటంతో నియంత్రణ కేంద్రం చేతులు దాటిపోయింది. అందుకనే ఉద్దేశ్యపూర్వకంగా రాష్ట్రాలపై నెట్టేసింది. కరోనాను నియంత్రించాలంటే లాక్ డౌన్ ఒకటే మార్గమని అందరికీ తెలిసిందే. అయితే లాక్ డౌన్ పెడితే ఆర్ధికంగా పడే భారాన్ని, నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రమైనా, రాష్ట్రాలైనా వెనకాడుతున్నాయి.
అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే లాక్ డౌన్ విధించటం రాష్ట్రాలకు ఇష్టంలేదు. అదే సమయంలో కేసున నియంత్రణను ఫెయిలవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒకరాష్ట్రం లాక్ డౌన్ విధించినంత మాత్రాన ఉపయోగం లేదు. ఎలాగంటే ఏపిలో లాక్ డౌన్ విధించినా చుట్టుపక్కలున్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణాలో విధించకపోతే ఉపయోగం ఉండదు. ఒక రాష్ట్రంలో లాక్ డౌన్ విధించినంత మాత్రాన మరో రాష్ట్రం విదించాలని ఏమీలేదు.
ఇదే సమయంలో కేంద్రంగనుక లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాలన్నీ తప్పనిస్ధితిలో ఆమోదించాల్సిందే తప్ప వేరేదారిలేదు. సరిగ్గా ఈ బాధ్యత నుండే మోడి సర్కార్ తప్పుకున్నది. ముందేమో 18 ఏళ్ళు నిండినవారికి టీకాల విషయంలో చేతులెత్తేసిన కేంద్రం తాజాగా లాక్ డౌన్ విషయంలో కూడా బాధ్యత నుండి తప్పుకున్నది. అదికూడా ఐదురాష్ట్రాల్లో ఫలితాలు వచ్చి బొక్కబోర్లా పడిన మరుసటి రోజే కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించటం గమనార్హం.