Begin typing your search above and press return to search.
భారత్ లో కరోనా బీభత్సం .. అండగా పొరుగుదేశాలు .. భారీగా వైద్యసామాగ్రిని పంపిన రష్యా !
By: Tupaki Desk | 29 April 2021 8:30 AM GMTదేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ఉద్ధృతి బీభత్సంగా కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. రోజు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీనితో దేశంలోని అన్ని ఆస్పత్రులు కరోనా బాధితులతో పూర్తిగా నిండిపోయాయి. కరోనా బాధిత రోగుల తాకిడి పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ తోపాటు, ఇతర వైద్య సదుపాయాలు కూడా సరిపడటం లేదు. కరోనా మహమ్మారి రెండో వేవ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇండియాకు సాయమందించేందుకు పలు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి.
ఇదే క్రమంగా భారత్ భారీ సాయం అందించాలని మిత్ర దేశం రష్యా నిర్ణయించింది. తాజాగా రష్యా రెండు ప్రత్యేక విమానాల్లో భారత్ కు భారీగా వైద్యసామాగ్రిని పంపింది. రష్యా నుంచి 20 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, 75 వెంటిలేటర్లు, 150 బెడ్ సైడ్ మానిటర్లు, 22 మెట్రిక్ టన్నుల ఔషధాలతో బుధవారం బయలుదేరిన రెండు విమానాలు ఈ తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి. విమానాల నుంచి వైద్య సామాగ్రిని అన్ లోడ్ చేయించిన అధికారులు అవసరమున్న వివిధ ఆస్పత్రులకు చేరేవేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే .. అమెరికా భారీ సాయం అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 1000 ఆక్సిజన్ సిలిండర్లు, 1.5 కోట్ల ఎన్ 95 మాస్క్ లు, 10 లక్షల రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ కిట్ లను పంపించింది. నేడు తొలి విడత షిప్ మెంట్ ఇండియాకు చేరనుండగా, మిగతావి వచ్చే వారంలోగా ఇండియాకు రానున్నాయి. ఇండియాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండగా, వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య బుధవారం 2 లక్షలను దాటిందన్న సంగతి తెలిసిందే. ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతుండగా, మెడికల్ ఆక్సిజన్, అవసరమైన వారికి పడకలు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఇక నిన్న కొత్తగా 3,79,257 మందికి కరోనా నిర్ధారణ అయింది.