Begin typing your search above and press return to search.

దేశంలో మృత్యుఘోష .. 24 గంటల్లో రికార్డు స్థాయిలో !

By:  Tupaki Desk   |   29 April 2021 5:31 AM GMT
దేశంలో  మృత్యుఘోష .. 24 గంటల్లో రికార్డు స్థాయిలో !
X
ఇండియాలో కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో నిత్యం లక్షలాది కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటం తో యావత్ దేశం మొత్తం ఆందోళన నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. నిన్న‌ కొత్త‌గా 3,79,257 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం...నిన్న‌ 2,69,507 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 3,645 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,04,832 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,50,86,878 మంది కోలుకున్నారు. 30,84,814 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,00,20,648 మందికి వ్యాక్సిన్లు వేశారు. మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 63,309 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కర్నాటకలో 39,047, కేరళలో 35,013, యూపీలో 29,751, ఢిల్లీలో 25,986 మందికి పాజిటివ్ వచ్చింది. మనదేశంలో బుధవారం 17,68,190 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 28 కోట్ల 44 లక్షల 71 వేల 979 మందికి కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. ఇక టీకాల విషయానికొస్తే.. ఇప్పటి వరకు 15కోట్లకు పైగా డోసులు వేశారు. ఇదిలాఉంటే.. కేసులతోపాటు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశంలో వేగవంతంగా కొనసాగుతోంది. కరోనా కట్టడికి మే 1నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.