Begin typing your search above and press return to search.

కరోనాతో వేల మరణాలు.. దేశం దాచేస్తోందా?

By:  Tupaki Desk   |   28 April 2021 2:30 PM GMT
కరోనాతో వేల మరణాలు.. దేశం దాచేస్తోందా?
X
దేశంలో కరోనా విలయం చోటుచేసుకుంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు శ్మశానాల ముందు క్యూ కడుతున్న దృశ్యాలు ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తున్నాయి. పరిస్థితులు కలిచివేచేసేలా ఉన్నాయంటున్నారు. అయితే కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య మాత్రం పెద్దగా ఉండడం లేదు. నిజానికి అంతకు మించి 30 రెట్లు అధికంగా దేశంలో కేసులు, మరణాలు చోటుచేసుకుంటున్నాయా? కేసుల సంఖ్యను కేంద్రంలోని మోడీ సర్కార్ దాస్తోందా? మోడీ సర్కార్ చెబుతున్న లెక్కల కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయా? అంటే ఔననే అంటోంది సీఎన్ఎన్. ఈ మేరకు ఆధారలతో ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.

భారత్ లో ఇప్పటివరకు కరోనా బారినపడ్డ వారి సంఖ్య 52 కోట్లు.. మరణాల 9.90 లక్షలుగా ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం మంగళవారానికి 1.76 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. 1.98 లక్షల మంది కరోనాతో చనిపోయారు.

అయితే భారత్ ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలకు మరో 30 రెట్లు ఎక్కువగా కేసులు, మరణాలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు నిజాలను దాచిపెడుతున్నాయని ఆరోపిస్తున్నారు. వనరుల లేమి, మానవ తప్పిదాలు, పరీక్షలు తక్కువగా చేయడం వంటి కారణాలతో లెక్కలు బయటపడడం లేదని.. తక్కువగా నమోదవుతున్నాయని చెబుతున్నారు.

ఇక వాషింగ్టన్ వర్సిటీ ఆరోగ్య విభాగం కూడా భారత్ లో మే 2వ వారానికి మరణాలు భారీగా నమోదవుతాయని.. రోజు వారి మరణాల సంఖ్య 13వేలకు చేరుకోవచ్చని అంచనావేస్తోంది.

ఇక కరోనాతో ఇళ్లలో చనిపోయే వారి లెక్క ప్రభుత్వం చేయడం లేదని.. హోం ఐసోలేషన్ లో ఉన్న వారు చనిపోతే వాటిని కరోనా మరణాలుగా లెక్కించడం లేదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.