Begin typing your search above and press return to search.

కరోనాను చంపే స్ప్రే ... త్వరలోనే రాబోతుంది !

By:  Tupaki Desk   |   27 April 2021 11:30 AM GMT
కరోనాను చంపే స్ప్రే  ... త్వరలోనే రాబోతుంది !
X
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తుంది. ఈ తరుణంలో దేశంలోని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటివి పాటించపోతే దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తుంది. అయితే కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి ఆగడం లేదు. వైరస్ కట్టడి కోసం వ్యాక్సిన్ ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతున్నా మరో పక్క భారీ ఎత్తు కరోనా కేసులు నమోదవుతన్నాయి.

అయితే కరోనా వైరస్ కు నాసల్ స్ప్రే సిద్ధం అయింది. కరోనా వైరస్ ఊపిరి తిత్తుల లోకి రాకుండా ముక్కు రంధ్రాల్లో నే చంపేసే ఈ నాజల్ స్ప్రే త్వరలోనే భారత్ మార్కెట్ లోకి విడుదల కాబోతుంది. కెనడాకు చెందిన సానోటైజ్ సంస్థ దీనిని సిద్ధం చేసింది.ఈ కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ఈ స్ప్రే 95 శాతం పని చేస్తుందని సంస్థ చెబుతోంది. నాసల్‌ స్ప్రే వాడకంతో కరోనా వైరస్‌ పెరుగుదలని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. కరోనా వైరస్ కు కారణమయ్యే వైరస్‌ స్థాయిని 95 శాతం వరకు తగ్గించిందని ఆ సామ్,సంస్థ తెలిపింది. ఇప్పటికే లండన్ లో అత్యవసర అనుమతులు పొందిన ఈ సంస్థ భారత్ లో భాగస్వామి కోసం ఎదురుచూస్తుంది.ఇప్పటికే యూకేలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన ఈ స్ప్రే ఇజ్రాయెల్‌లో తయారవుతున్నదని తెలిపింది. భారత భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని సంస్థ సీఈవో, కో-ఫౌండర్‌ ఆఫ్‌ సానోటైజ్‌ డాక్టర్‌ గిల్లీ రీగవ్‌ తెలిపారు.

భార‌త్‌లో ప్ర‌తిరోజు మూడు ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు నమోద‌వుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. నిన్న‌ కొత్త‌గా 3,23,144 మందికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే ,నిన్న‌ 2,51,827 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,76,36,307 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 2,771 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,97,894కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,45,56,209 మంది కోలుకున్నారు.