Begin typing your search above and press return to search.

భారత్ లో కొనసాగుతున్న కరోనా విజృంభణ..24 గంటల్లో మరోసారి భారీగా కేసులు, మరణాలు !

By:  Tupaki Desk   |   27 April 2021 6:31 AM GMT
భారత్ లో కొనసాగుతున్న కరోనా విజృంభణ..24 గంటల్లో మరోసారి భారీగా కేసులు, మరణాలు !
X
ఊహించని విధంగా దేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. క్రమంగా కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటుగా క్రియాశీల కేసుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. భారత్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, కరోనా సెకండ్ వేవ్ ను అడ్డుకోవాలని చేస్తున్న ఏ ప్రయత్నం కూడా సఫలం అవుతున్నట్టు కనిపించడం లేదు. దీనితో గత కొన్ని రోజులుగా దేశంలో దాదాపుగా 3 లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో సోమవారం దేశవ్యాప్తంగా 3,23,144 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2771 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,76,36,307 కు పెరగగా.. మరణాల సంఖ్య 1,97,894 కి చేరింది. ఈ మేరకు మంగళవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. నిన్నటితో పోల్చుకుంటే కరోనా కేసులు, మరణాల సంఖ్య కొంతమేర తగ్గింది. ఇదిలాఉంటే, సోమవారం కరోనా నుంచి 2,51,827 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,45,56,209 కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 28,82,204 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా.. ఆదివారం దేశవ్యాప్తంగా 16,58,700 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 26 వరకు మొత్తం 28,09,79,877 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. కాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుంది. మే 1 నుండి 18 ఏళ్లు పై బడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.