Begin typing your search above and press return to search.
బ్రిటన్ + బ్రెజిల్ + దక్షిణాఫ్రికా = భారత్ అల్లకల్లోలం
By: Tupaki Desk | 26 April 2021 1:30 PM GMTభారత్ లో సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ఎందుకు ఉంది? ఇంతటి తీవ్రతకు కారణమేంటి? రికవరీ తగ్గటానికి కారణమేమిటి? లాంటి ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. దీంతో.. ఈ అంశంపై ఫోకస్ చేసింది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (సింఫుల్ గా చెప్పాలంటే ఐజీఐబీ) దేశంలో నెలకొన్న తాజా పరిస్థితి నేపథ్యంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తికి కారణమైన కోవిడ్ వేరియంట్ల మీద ఈ సంస్థ లెక్క తేల్చే ప్రయత్నం చేసింది.
మూడు వేరియంట్లు.. వాటి ఉత్పరివర్తనాలే (మ్యుటేషన్) తాజా పరిస్థితికి కారణంగా తేల్చారు. ఆ మూడు.. యూకే.. బ్రెజిల్.. దక్షిణాఫ్రికాకు చెందిన మూడు వేరియంట్లు దేశంలో కరోనా అల్లకల్లోలానికి కారణంగా గుర్తించారు. అయితే.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వేరియంట్ దాడి చేసినట్లు గుర్తించారు.
ఐజీఐబీ గుర్తించిన మూడు వేరియంట్లు ఏవంటే..
1. బ్రిటన్ వెరైటీ (బి.1.1.7)
2. బ్రెజిల్ వెరైటీ (బి.1.1.28)
3. దక్షిణాఫ్రికా వెరైటీ (బి.1.351)
మొదటి వేవ్ వైరస్ తో పోలిస్తే రెండో వేవ్ వైరస్ ప్రమాదకరమైనదిగా గుర్తించారు. మొదటి దానితో పోలిస్తే.. ఈ దశలో వచ్చి పడుతున్న వైరస్ చాలా త్వరగా దాడి చేయటంతోపాటు.. వైరస్ ఎప్పటికప్పుడు తన రూపును మార్చుకుంటున్నట్లు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో చికిత్సకు అంతుచిక్కకుండా గాలి ద్వారా వ్యాపిస్తోందని తేల్చారు. ఈ నేపథ్యంలో ఒక మాస్కు కాకుండా.. రెండో మాస్కులు వాడటం మినహా మరో మార్గం లేదన్న మాట వినిపిస్తోంది.
దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో వేరియంట్ డబుల్ మ్యుటేట్ అయినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. మహారాష్ట్రలో ఉన్న బి.1.617 కాస్తా ఇ484క్యూ.. ఎల్452గా మార్పు చెంది ఊపిరితిత్తుల కణాలకు వైరస్ బలంగా అతుక్కుపోతున్నట్లు గుర్తించారు. దీంతో.. కరోనా నుంచి ఒకసారి కోలుకున్న తర్వాత కూడా మరోసారి దాడి చేస్తున్నట్లు గుర్తించారు.
పశ్చిమబెంగాల్ లో బి.1.678 వేరియంట్ తీవ్రంగా ఉంది. ఈ వైరస్ మ్యుటేట్ అవుతూ కొమ్ముల్లో అమైనో ఆమ్లాలు తొలిగి.. ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటుందని.. అందుకే ఒకరి నుంచి మరొకరు త్వరగా వ్యాప్తి చెందే వీలుందన్నారు. దీనికి గాలి ద్వారా వ్యాపించే స్థాయికి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. మొదటి దశతో పోలిస్తే.. రెండో దశలోని ఈ వైరస్ ను అరికట్టటం కంటే అప్రమత్తతతోనే చెయిన్ బ్రేక్ చేయటం మంచిదన్న మాట వినిపిస్తోంది.