Begin typing your search above and press return to search.
ఇప్పుడే 25లక్షల యాక్టివ్ కేసులు.. ‘మే’ రెండో వారానికి ఎన్ని యాక్టివ్ కేసులు?
By: Tupaki Desk | 25 April 2021 3:30 AM GMTసాధించాం.. విజయం సాధించాం.. మహమ్మారి తోక ముడుచుకు పారిపోయేలా చేశామన్న మాటల్లో డొల్లతనం ఎంతన్న విషయం తాజాగా దేశ పరిస్థితిని చూసినప్పుడు ఇట్టే అర్థమైపోతుంది. దీనికి కారణం ఎవరన్న విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అందరికి అన్ని తెలిసినవే. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలి? రానున్న రోజుల్లో ఏం జరగనుంది? మనకు ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? అన్నది అసలు ప్రశ్న. అన్నింటికి మించి.. దేశంలో తొలి పది లక్షల కేసులు నమోదు కావటానికి 150 రోజులు పడితే.. తాజాగా కేవలం 72 గంటలు మాత్రమే పట్టింది. ఈ లెక్కన రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోనున్నాయి? అన్నది ఇప్పుడు ప్రశ్న.
తాజాగా కరోనా మహమ్మారి వేగం చూస్తే.. ఈ నెలఖరు వరకు జోరు ఆగేట్లు అస్సలు కనిపించటం లేదు. ఇప్పుడు రోజుకు 3.5 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య రానున్న వారం రోజులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక లెక్క ప్రకారం చూస్తే.. మరో ఏడు రోజుల్లో 5 లక్షల నుంచి 5.5 లక్షల రోజువారీ కేసులకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. రోజురోజుకు పెరుగుతున్న కేసుల వ్యాప్తి మొత్తం కరోనా పాజిటివ్ రోగులకు అందే వైద్య సాయం మీదనే ఉంటుంది.
ఇప్పటికిప్పుడు దేశంలో వైద్య ఆరోగ్య పరిస్థితులు మెరగయ్యే పరిస్థితి లేదు. తీవ్రమైన బెడ్ల సమస్యతో పాటు.. రెమెడెసివర్.. ఆక్సిజన్ సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు రోగుల్ని పరామర్శించేందుకు వారి కుటుంబ సభ్యులు అదే పనిగా తిరగటం.. వైద్య సాయం కోసం తిప్పటం లాంటి వాటితో వైరస్ మరింతలా వ్యాపించటమే కాదు.. కొత్త కేసులకు కారణమవుతోంది.
కొందరు నిపుణుల లెక్కల ప్రకారం.. కరోనా వైరస్ వ్యాప్తి ‘మే ’రెండో వారం వరకు సాగుతుందని చెబుతున్నారు. ఏప్రిల్ 30 నాటికి గరిష్ఠస్థాయికి చేరుకోవటం ఖాయమంటున్నారు. అంటే.. ఇప్పుడున్న 25 లక్షల యాక్టివ్ కేసులు.. నెలాఖరుకు 30 నుంచి 35 లక్షలకు చేరుకునే వీలుందని చెబుతున్నారు. రికవరీ రేటు ఇప్పటికి బాగానే ఉన్నా.. మరింత మెరుగుపడాల్సి ఉంటుంది. తీవ్రత పరిమితంగా ఉంటే.. రికవరీ అధిగమించే వీలుంది.
ప్రస్తుతం ఉన్న పదిరాష్ట్రాలకు అదనంగా.. రానున్న వారంలో ఢిల్లీ.. హర్యానా.. రాజస్థాన్.. తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటి పరిస్థితి అదే తీరులో కొనసాగితే.. మే రెండో వారానికి తక్కువలో తక్కువ 40 లక్షల కేసుల వరకు చేరే వీలుందన్న మాట వినిపిస్తోంది. పరిస్థతి ఇప్పుడున్నంత దారుణంగా ఉంటే.. మరిన్ని ఎక్కువ కేసులు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.
సో.. మే రెండో వారం వరకు ఇప్పుడున్న పరిస్థితుల కంటే మరింత ఇబ్బందికరంగా ఉండే వీలుంది. అయితే.. భారత్ కు ఉన్న ఏకైక విలక్షణత ఏమంటే.. అనుకోనిది జరిగినప్పుడు ఆందోళన చెందిన దాని కంటే మిన్నగా పని చేసి.. పరిస్థితిని కంట్రోల్ లోకి తెచ్చుకోవటం.. ఇప్పటికే చాలాసార్లు అనుభంలోకి వచ్చి ఉంటుంది. మరి.. ఇప్పుడు ఏమవుతుందన్నది అసలు ప్రశ్న.