Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ వేళ.. దేశంలో పలు రాష్ట్రాల ఆంక్షలు ఎలా ఉన్నాయ్?

By:  Tupaki Desk   |   14 April 2021 6:30 AM GMT
సెకండ్ వేవ్ వేళ.. దేశంలో పలు రాష్ట్రాల ఆంక్షలు ఎలా ఉన్నాయ్?
X
చూస్తుండగానే వచ్చేసిన సెకండ్ వేవ్.. దేశ వ్యాప్తంగా చెలరేగిపోతోంది. క్యాలెండర్ లో రోజు గడిచేసరికి పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న కేసులకు చెక్ చెప్పేందుకు వీలుగా.. పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షల్ని విధిస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న నిబంధనల్ని చూసినప్పుడు.. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే.. ఆయా రాష్ట్రాలే కఠినంగా వ్యవహరిస్తున్నాయనిపించక మానదు.

ఇంతకూ దేశంలోని వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న కఠిన ఆంక్షలు.. నిబంధనలు ఎలా ఉన్నాయో చూస్తే..
జమ్ముకశ్మీర్

8 జిల్లాల్లో రాత్రి వేళలో కర్ఫ్యూ
రాష్ట్రానికి వచ్చే వారికి తప్పనిసరిగా పరీక్షలు
విద్యా సంస్థలు బంద్

పంజాబ్

ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ
రాజకీయ.. మత కార్యక్రమాలు రద్దు
విద్యా సంస్థల మూసివేత

హర్యానా

రాత్రి వేళ కర్ఫ్యూ
పెళ్లిళ్లు.. ఇతర కార్య్రమాలకు 200 - 500 లోపే హాజరుకు అనుమతి
ఛండీగఢ్
రాత్రి కర్ఫ్యూ

ఢిల్లీ

ఏప్రిల్ నెలాఖరు వరకు కర్ఫ్యూ
50 శాతం సామర్థ్యంతో ఆఫీసులు.. బస్సు.. మెట్రో సర్వీసులు
పెళ్లిళ్లు..ఇతర వేడుకులకు 200 మంది వరకే అనుమతి

గుజరాత్
20 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ
సామూహిక కార్యక్రమాలురద్దు
తొమ్మిదో తరగతి వరకు స్కూళ్లు బంద్

ఉత్తరాఖండ్
12 రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కొవిడ్ టెస్టు తప్పనిసరి. నెగిటివ్ వస్తేనే ఎంట్రీ

హిమాచల్ ప్రదేశ్
7 రాష్ట్రాల నుంచి వచ్చే వారికి నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి
పెళ్లిళ్లకు 200 మంది వరకు పరిమితి
ఏప్రిల్ 15వరకు స్కూళ్లు మూసివేత

బిహార్
రాత్రి 7 వరకే షాపులు
పెళ్లిళ్లకు.. వేడుకులకు 200 మందికే అనుమతి
ఏప్రిల్ 18 వరకే బడులు.. కాలేజీల మూత

మధ్యప్రదేశ్
19వరకు రాత్రి కర్ఫ్యూ
5 జిల్లాలు.. ఒక నగరంలో లాక్ డౌన్
ఛత్తీస్ గఢ్ తో రాకపోకలు బంద్
వారానికి 5 రోజులే ప్రభుత్వ కార్యాలయాలు
విద్యా సంస్థల మూసివేత

జార్ఖండ్
మతపరమైన ర్యాలీలపై నిషేధం
ఎగ్జిబిషన్లు బంద్
నెలాఖరు వరకు విద్యా సంస్థలు.. జిమ్ లు క్లోజ్

ఛత్తీస్ గఢ్
17వరకు రాయ్ పూర్.. 19 వరకు దుర్గ్ లో పూర్తిస్థాయి లాక్ డౌన్
అన్ని పట్టణాల్లో రాత్రిళ్లు కర్ఫ్యూ
బస్సుల్లో 50 శాతం మందికే అనుమతి

మహారాష్ట్ర
15 రోజులు కర్ఫ్యూ
అన్ని ఆఫీసులు.. పార్కులు.. జిమ్ లు.. థియేటర్లు మే ఒకటి వరకు బంద్

ఉత్తరప్రదేశ్
9 జిల్లాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ
500 కేసులు ఉన్న జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ
స్కూళ్లు మూసివేత

ఒడిశా
రాష్ట్రానికి వచ్చే వారంతా నెగిటివ్ రిపోర్టు చూపించాలి
గోవా
తొమ్మిదో క్లాసు వరకు స్కూళ్లు మూసివేత
సభలపై నిషేధం

కేరళ

విదేశాల నుంచి వస్తే వారం క్వారంటైన్
బహిరంగ ప్రదేశాల్లో 200 మందితో భేటీలు.. గదుల్లో అయితే 100 మందికే

తమిళనాడు
నెలాఖరు వరకు పాక్షిక లాక్ డౌన్
మతపరమైన కార్యక్రమాలు రద్దు
కోయంబేడ్ లో రిటైల్ అమ్మకాలు నిషేధం
రెస్టారెంట్లలో 50 శాతానికే అనుమతి

కర్ణాటక
బెంగళూరు సహా 7 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ

తెలంగాణ
అన్ని బడులు.. కాలేజీలు.. వర్సిటీలు మూసివేత