Begin typing your search above and press return to search.
హిస్టరీ రిపీట్ : మళ్లీ లక్ష దాటిన కరోనా కేసులు..!
By: Tupaki Desk | 5 April 2021 5:02 AM GMTభారత్ లో కరోనా మహమ్మారి కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత దేశంలో తొలిసారి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. గత ఏడాది సెప్టెంబరు 17న దేశంలో గరిష్ఠంగా 97,894 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డు దాటి గత 24 గంటల్లో 1,03,558 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఇక దేశంలో రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్కును దాటేసింది. ఈ ఏడాది ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. అలాగే, ఆదివారం వైరస్ బారినపడి 478 మంది ప్రాణాలు విడిచారు.
కాగా ఇప్పటి వరకు 1,25,89,067 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం 1,65,101 మంది మరణించారు. కొత్తగా 52,847 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మొత్తం కరోనాను జయించిన వారి సంఖ్య1,16,82,136కి చేరింది. దేశ వ్యాప్తంగా 7,41,830 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 7 కోట్ల 91 లక్షల మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,90,19,657 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,93,749 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1,097 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 268 మంది కోలుకున్నారు. దీనితో తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,237కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,02,768 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,723గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 8,746 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,458 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ ఎం సీ పరిధిలో కొత్తగా 302 మందికి కరోనా సోకింది.