Begin typing your search above and press return to search.

అలర్ట్ః అప్పుడే పుట్టిన‌ చిన్నారుల‌నూ వ‌ద‌ల‌ని క‌రోనా..!

By:  Tupaki Desk   |   2 April 2021 11:30 PM GMT
అలర్ట్ః అప్పుడే పుట్టిన‌ చిన్నారుల‌నూ వ‌ద‌ల‌ని క‌రోనా..!
X
దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తోంది. మార్చి 29న ఒక్క రోజే దేశంలో 68వేల చిల్ల‌ర కేసులు న‌మోద‌య్యాయి. ముందుగానే స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం.. రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై దృష్టి పెట్టాల‌ని ఆదేశాలు జారీచేసింది.

రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ముంద‌స్తుగానే ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించాయి. కానీ.. చాలా మంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నందువ‌ల్లే కేసులు తీవ్ర‌స్థాయిలో పెరుగుతున్నాని నిపుణులు చెబుతున్నారు. జ‌నాలు ఎక్కువ‌గా సంద‌ర్శించే షాపింగ్ మాల్స్‌, అన్ని ర‌కాల మార్కెట్లలో భౌతిక దూరం పాటించాల‌ని, తప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి. కానీ.. చాలా మంది నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

అయితే.. మొద‌టి ద‌శ‌లో చిన్న పిల్ల‌లో క‌రోనా తీవ్ర‌త కాస్త త‌క్కువ‌గానే న‌మోదైంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. కానీ.. సెకండ్ వేవ్ లో చిన్న పిల్ల‌ల‌నూ వ‌ద‌ల‌ట్లేద‌ని తెలుస్తోంది. ఎన్నో వేరియంట్లుగా మార్పు చెందిన మ‌హ‌మ్మారి.. మ‌రింత బ‌ల‌వంతంగా రూపాంత‌రం చెందిన‌ట్టు బ్రిట‌న్, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు నిరూపించాయి. ఇవి భార‌త్ లోనూ క‌నిపిస్తున్నాయ‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నారు.

తాజాగా గుజ‌రాత్ లోని వ‌డోద‌రాలో క‌వ‌ల పిల్ల‌ల‌కు పాజిటివ్ వ‌చ్చింది. వారు జ‌న్మించిన 15 రోజుల త‌ర్వాత తీవ్ర విరేచ‌నాలు, అనారోగ్యంతో బాధ‌ప‌డుతుండ‌డంతో ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో.. కొవిడ్ సోకిన‌ట్లు నిర్ధారించారు. ప్ర‌స్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, నిర్ల‌క్ష్యం ప‌నికిరాద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు.