Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వేసుకున్నవారి నుండి కరోనా సోకదట !

By:  Tupaki Desk   |   1 April 2021 12:30 PM GMT
వ్యాక్సిన్ వేసుకున్నవారి నుండి కరోనా సోకదట !
X
యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి భయపెడుతున్న సమయంలో శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ దైర్యం గా వేసుకోవాలి అని చెప్తున్నారు. వ్యాక్సిన్లను మరో 9 నెలల్లో వినియోగించుకోకపోతే అవి నిరూపయోగంగా మారిపోతాయని అంటున్నారు. అదే జరిగితే కరోనాపై పోరాటంలో ఓడిపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా తగ్గుతుందా అనే అనుమానం చాలామందిలో ఉంది. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న కొందరు అనేక వ్యాధులకు గురి కావడంతో చాలామంది వ్యాక్సిన్ అంటేనే భయపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనా పూర్తిగా రాదని శాస్త్రవేత్తలు చెప్పట్లేదు.. కానీ దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది అని చెబుతున్నారు.

అంతేకాదు.. టీకాలు వేసుకున్న వ్యక్తులు కరోనా ప్రసారం చేసే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులు వైరస్‌ ను క్యారీ చెయ్యరని, వైరస్ క్యారియర్లుగా ఉండరని అధ్యయనాలు చెబుతున్నాయని సిడిసి డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ చెప్పారు. ఈ అధ్యయనం ప్రకారం.. వ్యాక్సిన్‌ లు ఫ్రంట్-లైన్ వర్కర్లకు, పెద్దవారికి ఇవ్వగా.. వైరస్ బారిన పడే ప్రమాదం వారికే ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే యునైటెడ్ స్టేట్స్ చుట్టూ ఎనిమిది ప్రదేశాలలో పరిశోధకులు దాదాపు 4,000 మంది ఆరోగ్య కార్యకర్తలు అవసరమైన కార్మికుల నుండి డేటాను సేకరించారు.

ఫైజర్-బయోఎంటెక్ లేదా మోడరనా వ్యాక్సిన్ ఒక మోతాదు తరువాత సంక్రమణ ప్రమాదం 80% తగ్గింది. రెండవ మోతాదు తరువాత, క్లినికల్ ట్రయల్స్‌లో శాస్త్రవేత్తలు చూసిన మాదిరిగానే వారి ప్రమాదం 90% తగ్గింది, ఇది రెండు-మోతాదు వ్యాక్సిన్ సమర్థత రేటును 95% చూపించింది. ఒక్కరికి కూడా వ్యాపించలేదు. అయితే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాను సూచించిన మార్గదర్శకాలు మాత్రం పాటించవలసిందే అని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైరస్ చాలా చిన్నది. వెంట్రుకలో వెయ్యో వంతు ఉంటుంది. అంత చిన్న వైరస్ తన రూపాన్ని మార్చుకోవడం క్షణాల్లో పని. ఈ ప్రపంచంలో కరోనాకి వ్యాక్సిన్ వచ్చేంతవరకూ కరోనా వైరస్ తన రూపాన్ని పెద్దగా మార్చుకోలేదు. కొత్త స్ట్రెయిన్‌లు ఇప్పుడున్న టీకాలకు సవాల్‌ విసురుతున్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న వ్యాక్సిన్‌లను అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.