Begin typing your search above and press return to search.
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల వేగం లెక్క తెలిస్తే వణుకు ఖాయం
By: Tupaki Desk | 26 March 2021 5:05 AM GMTమాయదారి మహమ్మారి సెకండ్ వేవ్ వేగంగా దూసుకొస్తోంది. తొలిసారి మించిన స్పీడ్ ఇప్పుడు దాని గమనంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కరోనా ప్రపంచానికి పరిచయమైన కొత్తల్లో నెలకొన్న ఆందోళన కారణంగా.. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు అందుకు భిన్నంగా..కరోనా ముప్పును తేలిగ్గా తీసుకోవటం.. దానికి తోడు ఇది విస్తరిస్తున్న వేగానికి సంబంధించిన లెక్క తెలిస్తే వణుకు ఖాయం.తాజాగా వెలువడుతున్న గణాంకాల్ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.
2020లో కరోనా కేసుల సంఖ్య మన దేశంలో 20వేల నుంచి 50 వేలకు పెరగటానికి 32 రోజులు పట్టింది. అదే ఇప్పుడు మాత్రం కేవలం 14 రోజులు మాత్రమే పట్టింది. అంటే.. కేసుల నమోదులో పెరుగుదల వేగం గత ఏడాది కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఎందుకిలా? అంటే..ఒకటి కాదు రెండు కాదు బోలెడన్ని కారణాలు.
అన్నింటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది.. నత్త నడకన నడుస్తున్న టీకా కార్యక్రమంగా చెప్పాలి. జనవరి 16న మన దేశంలో వ్యాక్సినేషన్ మొదలుకాగా.. జనవరి 19 నుంచి కేసులు పెరుగుతున్నాయే తప్పించి తగ్గని దుస్థితి. అమెరికా.. బ్రిటన్.. ఇజ్రాయెల్ తో పోలిస్తే మన దేశంలో టీకా కార్యక్రమం ఆలస్యంగా అమలు జరుగుతోంది. ఇజ్రాయెల్ లో ప్రతి వంద మందికి 114 డోసుల టీకా ఇప్పటివరకు ఇవ్వగా.. అమెరికాలో ప్రతి వంద మందికి 39 డోసులు మాత్రమే ఇచ్చారు.
అదే మన దేశం విషయానికి వస్తే ప్రతి వందమందికి ఇప్పటివరకు ఇచ్చింది నాలుగు డోసులు మాత్రమే. అంటే.. ప్రతి వంద మందిలో ఇద్దరికి మాత్రమే రెండు డోసులు ఇచ్చారు. ఇక.. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇది మరింత తక్కువగా ఉంది. తెలంగాణ విషయానికి వస్తే.. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇచ్చిన డోసుల సంఖ్య కేవలం 10.5 లక్షలు మాత్రమే.
తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే రెండు కోట్ల డోసులు కావాలి. కానీ.. ఇప్పటివరకు వచ్చిన డోసులు కేవలం 24 లక్షలు మాత్రమే. అలా వచ్చిన 24 లక్షల డోసుల్లో 10.5లక్షల మందికే ఇచ్చారు. అందులో రెండు డోసులు తీసుకున్న వారు 2.19లక్షలు మాత్రమే. మొత్తం కోటి మందిలో సింగిల్ డోసులు వేసుకున్న వారు.. అసలు వేసుకోని వారంతా కలిపితే 97 లక్షలకు పైనే ఉంటారు. కానీ.. చేతిలో ఉన్నది మాత్రం 13.5లక్షల డోసులే. ఈ లెక్కన డోసుల సంఖ్య భారీగా పెంచి.. ప్రజలకువాటిని అందించేసరికి ఎన్నాళ్లు పడుతుంది? అంతలోకి ఎంతమందికి పాజిటివ్ బారిన పడతారు? లెక్కలు వేసే కొద్దీ వణుకు తప్పించి మరింకేమీ మిగలని పరిస్థితి. ఈ తీవ్రత ప్రభుత్వాలకు ఎందుకు తెలీకుండా పోతోంది?